Callrate | Hike | Spectrum

Mobile call service rates can go up by 12 15

cell, mobile, charges, calls, rates, telecome, comminications, spectrum, ravishankar, dot,

Mobile call and service rates can go up by 12-15% to make up for the Rs 1,09,874.91 spectrum price telecom operators need to pay to government, industry body COAI said.

కాక పుట్టించనున్న కాల్ రేట్లు.. 12-15% పెరిగే అవకాశం..!

Posted: 04/01/2015 08:37 AM IST
Mobile call service rates can go up by 12 15

మొబైల్ వినియోగదారులకు కాల్ ఛార్జీల మోత మోగనుంది. స్పెక్ట్రమ్ వేలం నేపథ్యంలో భారీగా చెల్లించి అనుమతులు పొందిన కంపెనీలు తమ భారాన్ని భర్తీ చేసుకోవడానికి ఛార్జీలు పెంచే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. మొబైల్‌ కాల్‌ రేట్లు, సేవల చార్జీలు 12 నుంచి 15 శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలతో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన కంపెనీలు ఆ భారాన్ని తట్టుకోవాలంటే ఈ భారాన్ని మోపక తప్పదని ద సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాల్‌ రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ టెలికం కంపెనీలు చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ సెక్రటరీ రాకేష్‌ గార్గ్‌ చేసిన విశ్లేషించారు.స్పెక్ట్రమ్‌ కొనుగోళ్ల కాలపరిమితి 20 ఏళ్ల వరకూ ఉంటుంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే టెలికం కంపెనీలకు ఏడాదికి సగటున 5300 కోట్లకు మించి ఖర్చు కాదని, ఈ భారాన్ని తట్టుకునేందుకు ఆ కంపెనీలు ప్రస్తుతం ఉన్న కాల్‌రేట్లపైన నిమిషానికి రూపాయి ముప్పై పైసలు చొప్పున పెంచితే సరిపోతుందని రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

అయితే ఛార్జీల పెంపుకు సహేతుక కారణాలున్నాయని మొబైల్ ఆపరేటర్లు వాదిస్తున్నారు. వేలం దెబ్బకు తమపై పడిన భారాన్ని తట్టుకోవాలంటే.. ప్రస్తుత టారిఫ్‌లపై 12 నుంచి 15 శాతానికి పైగా పెంపు తప్పదన్నదిద సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా  పేర్కొన్నది. ద్రవ్యోల్బణం, స్పెక్ట్రం అధిక ధరలు, పరికరాలకు అయ్యే అధిక వ్యయం, ఇతర ఖర్చులు.. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే రూపాయి ముప్పై పైసల పెంపు సెల్‌ఫోన్‌ ఆపరేటర్ల కష్టాలను ఎలా తీరుస్తుందో అర్థం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పరికరాల కొనుగోళ్లకు తాము ఇప్పటికే ఏటా 700 నుంచి 800 కోట్ల డాలర్లు  ఖర్చు చేస్తున్నామని.. గతంలో కన్నా అనుమతులకు చట్టాలు మార్పులు వచ్చిన నేపథ్యంలో  ఈ ఖర్చు ఇంకా భారీగా పెరగబోతోందని పేర్కొంది. టెలికం ఆపరేటర్లు ఇప్పటకే ఏటా తమ ఆదాయంలో 13-14 శాతం మేర లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీల కింద ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్టు గుర్తుచేసింది. ఒకవైపు తమ ఖర్చులు ఇంత భారీస్థాయిలో ఉండగా.. ఆదాయం చూస్తే సగటున ఒక వినియోగదారుడి నుంచి వస్తున్న ఆదాయం కేవలం 2.96 డాలర్లు మాత్రమేనని, అంతర్జాతీయంగా ఈ సగటు 35 నుంచి 40 డాలర్ల దాకా ఉందని తెలిపింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చార్జీలు పెంచకుండా ఉంటే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరి గతంలో మొబైల్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించిన టెలికాం మంత్రి దీనిపై ఎలాంటి చర్యలకు దిగుతారో చూడాలి. మరి పెరిగిన మొబైల్ ఛార్జీలను భరించడానికి వినియోగదారులు సిద్దంగా ఉండాలని విశ్లేషకులు ముందే హెచ్చరిస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cell  mobile  charges  calls  rates  telecome  comminications  spectrum  ravishankar  dot  

Other Articles