బిక్షగాళ్లు అని అంటేనే చాలా మందికి అదో రకమైన భావం. ఎప్పుడూ రోడ్ల మీద డబ్బులు అడుక్కుంటూ ఉంటారు.అయితే బిక్షగాళ్లకే అకౌంట్లు ఉండి, ఏటియం కార్డులు ఉంటే ఎలా ఉంటుంది. అసలు వారి కోపమే ప్రత్యేకంగా బ్యాంక్ ఉంటే ఎలా అనిపిస్తుంది. అచ్చంగా అలాగే బిక్షగాళ్ల కోసమే ఓ బ్యాంక్ వచ్చేసింది. అందులో మేనేజర్ దగ్గరి నుండి అందూరూ బిక్షగాళ్లే. ఇంతకీ బిక్షగాళ్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పడ్డ బ్యాంక్ ఎక్కడ ఉంది, దాని వివరాలు ఏంటో తెలుసుకోవాలా అయితే స్టోరీ పూర్తిగా చదవండి.
ముష్టి అడుక్కొనే 40 మంది భిక్షగాళ్లు 'మంగళ' పేరుతో ఓ బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన గయాలోని మంగళగౌరి అమ్మవారి గుడిలోని భిక్షగాళ్ల ఆలోచనకు ప్రతిరూపమే ఈ మంగళ బ్యాంక్. అయితే బ్యాంక్ ఏర్పాటు చెయ్యగానే, లక్షలు, కోట్లు కూడబెట్టి వార్తలకెక్కిన వారు కాదు. కనీసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటివి కూడా వీరికి అందుబాటులో లేవు. దాంతో తమ భవిష్యత్ అవసరాల కోసం, ఆపదలో ఉన్నపుడు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నపుడు తమను ఆదుకోవడం కోసం చేసుకున్న ఒక చిన్న వెసులుబాటు ఈ మంగళబ్యాంక్. కాగా ఇక్కడ మేనేజర్ సహా సిబ్బంది అంతా బెగ్గర్లే.
ప్రతీ మంగళవారం ప్రతి ఖాతాదారు 20రూ. చొప్పున మొత్తం 800 రూ. జమ చేసుకుంటారు. అలా కూడబెట్టిన సొమ్మును తమ అవసరాల కోసం వాడుకుంటారు. అంతేకాకుండా ఈ బ్యాంక్ లోన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ప్రమాదంలో గాయపడిన ఒక బెగ్గర్ కుటుంబానికి ఎనిమిది వేల రూపాయల సాయాన్ని కూడా అందిస్తుంది. 40మంది సభ్యులు, ఒక మేనేజర్, ట్రెజరర్, సెక్రటరీ, ఓ ఏజెంట్ ఉన్న ఈబ్యాంక్లో ప్రతీ కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసుకుంటారు. అచ్చంగా అన్ని బ్యాంకుల్లాగానే వీరికి నియమ నిబంధనలు ఉంటాయి. తమ భవిష్యత్ అవసరాల కోసం మంగళ బ్యాంక్ బాగా ఉపయోగపడుతోందని సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర నిరుపేదలు, సాంఘిక సంక్షేమ సంస్థ సహకారంతో గత సంవత్సర కాలంగా ఈ బ్యాంక్ను విజయవంతంగా నడిపిస్తున్నారు. అన్నట్టు ఈ బ్యాంక్ సిబ్బంది అంతా బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ కోసం బాగా చదువుకోవడం మరో విశేషం. కానీ ఇంకో విషయం ఏమిటంటే ఇందులో మామూలు వ్యక్తులకు అసలు అకౌంట్ తెరవడానికి వీలు లేదు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more