Telanagana tdp leaders doing dharna at speaker chamber

thalasani, ttdp, tdp, speaker, chamber, telanagana, madhusudhanachary

telanagana tdp leaders doing dharna at speaker chamber. telanagana telugudesamparty mlas opposing the talasani srinivas. the thalasani srinivas won as mla by the tdp ticket, after that he joined the trs. ttdp leaders are anger on this and demand for action on thalasani.

తూఛ్.. మీరు ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే...

Posted: 03/24/2015 10:54 AM IST
Telanagana tdp leaders doing dharna at speaker chamber

ఇదేంటి చిన్న పిల్లల్లా ఇలా మాట్లాడుతున్నారేంటా అనుకుంటున్నారా.. అవును విషయం చెప్పడానికి చిన్న పిల్లలైనా ఇంకెవరైనా ఇలాంటి పదాలను వాడొచ్చు. ఇంతకీ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత టిఆర్ఎస్ లోకి చేరారు. ఇప్పుడు మంత్రిగా కూడా పదవిలో కొనసాగుతున్నారు. అయితే తమ పార్టీ టికెట్ మీద గెలిచిన వ్యక్తి ఎలా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరతారని, అంతగా చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరాలని తెలుగుదేశం తమ్ముళ్లు ముందు నుండి మండిపడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని స్పీకర్ ముందుకు తీసుకువెళ్లి తలసాని శ్రీనివాస్ పై అనర్హత వేటు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు  సమావేశమయ్యారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రాజీనామా తమకు అందిందా.. అని, దానిపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని టీటీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అయితే తనను శాసించలేరంటూ స్పీకర్‌ అక్కడి నుండి సభకు వెళ్లారు. అయితే స్పీకర్‌ వెళ్లిపోయినప్పటికీ టీటీడీపీ ఎమ్మెల్యే ఆయన చాంబర్‌లోనే కూర్చున్నారు. మామూలుగా అయితే అసెంబ్లీలో జరిగే నిరసనలు ఏకంగా తన చాంబర్ చేరడంతో స్పీకర్ మధుసూధనాచారి కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం తమ్ముళ్లకు ఎంత చెప్పినా వారు మాత్రం మాట వినడం లేదు. తలసాని శ్రీనివాస్ పై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ, స్పీకర్ చాంబర్ లోనే భీష్మించుకు కూర్చున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thalasani  ttdp  tdp  speaker  chamber  telanagana  madhusudhanachary  

Other Articles