Ys jagan mohan reddy suggested to ap minister uma to learn english first

ys jagan, ap, assembly, uma, devineni, supremecourt, english

ys jagan mohan reddy suggested to ap minister uma to learn english first. in ap assembly sessions jagan mohan reddy rise questions on almattidam. while the discussions jagan read the supreme court judgment.

ముందు ఇంగ్లీష్ నేర్చుకోండి.. మంత్రికి జగన్ సూచన

Posted: 03/18/2015 01:16 PM IST
Ys jagan mohan reddy suggested to ap minister uma to learn english first

ఏపి అసెంబ్లీలో మాటల తూటాలు పేలుస్తున్న ప్రతిపక్షనేత తన మాటల గారడిని ప్రదర్శిస్తున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడంపై జగన్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచినపుడు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి అలసత్వమే కారణం అంటూ ఏపి భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని విమర్శించారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. దేవినేని ఆరోపణలను జగన్ తప్పుపట్టారు. చంద్రబాబు హయాంలో సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు వల్లే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెరిగిందని జగన్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు కాపీని జగన్ అసెంబ్లీలొ చదివి వినిపించారు. దీనికి స్పందించిన జగన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని సభలో చదివి వినిపించారు. అయితే సుప్రీంతీర్పు ఇంగ్లీష్ లో చదివి,  అర్థం కాకపోతే ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఏపి భారీనీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమకు జగన్ సూచించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  ap  assembly  uma  devineni  supremecourt  english  

Other Articles