Chinnareddy questions eetala on aroghya sri

Congress MLA chinnaReddy, ChinnaReddy questions Eetala on Aroghya Sri, ChinnaReddy alleges government does't care for poor's health, eetala rajender tables first year long budget, Eetala first year long budget, telangana budget 2015-16, Telangana finance minister eetala rajender, telangana budget, Telangana Assembly,

Congress MLA chinnaReddy asks Telangana government on Aroghya Sri, alleges government does't care for poor's health

ఆరోగ్య శ్రీ పథకానికి నిధులేవి..? పేదల ఆరోగ్యం పట్టదా..?

Posted: 03/11/2015 01:09 PM IST
Chinnareddy questions eetala on aroghya sri

తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పెదవి విరిచారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ బడ్జెట్లో ఆరోగ్యశ్రీ ఊసే లేదన్నారు. పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకో దలచిందా అని ప్రశ్నించారు. పేదల ఆరోగ్యం గురించి నిధులేవని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లకు అరకోర నిధులు కేటాయించారని, ఆ  నిధులతో ఎప్పటికి పనులు పూర్తి చేస్తారన్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రజల అవసరాలు, వాస్తవ పరిస్థితులను గుర్తించి నిధుల కేటాయింపులు జరగాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సమస్య ఉన్నందున ఆ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలే మిగులు వ్యయం కలిగి ఉన్నాయని చెప్పుకుంటూన్న కేసీఆర్ ప్రభుత్వం...మరోవైపు ప్రజలపై వ్యాట్ పెంపు చేయటం దారుణమన్నారు. తక్షణం పెట్రోల్ డీజిల్ పై ఇటీవల విధించిన వ్యాట్ ను తగ్గించాలని ఢిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Budget 2015-16  Telangana Assembly  ChinnaReddy  

Other Articles