Eetala rajender tables first year long budget

eetala rajender tables first year long budget, Eetala first year long budget, telangana budget 2015-16, Telangana finance minister eetala rajender, telangana budget, Telangana Assembly,

eetala rajender tables first year long budget for the year 2015-16 today in Telangana Assembly

బడ్జెట్ అంటే ప్రజలతో మమేకమైన ప్రగతి

Posted: 03/11/2015 10:23 AM IST
Eetala rajender tables first year long budget

తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనలే తమ ప్రభుత్వ ఎజెండా అన్నారు. బడ్జెట్ అంటే అంకెలు, చిట్టా పద్దులు కావని, ప్రజలతో మమేకమైన ప్రగతిగా ఆయన పేర్కోన్నారు. తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక మంత్రి హోదాలో పూర్తిస్థాయిలో 2015-16 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తి అవగాహన, స్పృహతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ఆయన భరోసాయిచ్చారు. తెలంగణా రాష్ట్రంలో రెండో పర్యాయం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం అవిర్భవించిందన్నారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం సమగ్ర దృక్పధం, దార్శినికతకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేసినట్టు తెలిపారు. శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eetala rajender  budget 2015-16  Telangana Assembly  

Other Articles