No one will release in jammu kashmir after bjp warning on national security

pdp, bjp, jammu, kashmir, national security, central govt, home minister, masat alam, mufti, alliance

no one will release in jammu kashmir after bjp warning on national security. Upset over the release of separatist leader Masarat Alam in Jammu and Kashmir, BJP today gave an "ultimatum" to its ally PDP, asserting it will not tolerate such acts and there will be no compromise with national security.

ఇక విడుదలలు ఉండవు: కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటన

Posted: 03/11/2015 08:22 AM IST
No one will release in jammu kashmir after bjp warning on national security

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి పది రోజులు కూడా కాకముందే రాజకీయ దుమారం రేగింది. కరడుగట్టిన వేర్పాటువాది ఆలంను విడుదల చేస్తు అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో సంచనానికి తెర తీసింది. అయితే భాజపా మద్దతుతో ఉర్పడిన జమ్ము కాశ్మీర్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో, పార్లమెంట్ లొ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాయి. జమ్ముకశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి పీడీపీ  మెట్టు దిగింది. రాష్ట్రంలో ఇక ‘విడుదలలు’ లేవని ముఫ్తీ మహ్మద్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజకీయ ఖైదీలెవరినీ విడుదల చేసేది లేదని హోంశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ ప్రకటించారు. కరడుగట్టిన వేర్పాటువాది మసరత్‌ ఆలం విడుదలపై కశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత నిర్మల్‌ సింగ్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయనతో  చర్చించారు. మిలిటెంట్లు, వేర్పాటువాదుల విడుదలపై ఏకపక్ష నిర్ణయాలు ఇక సహించం. అధికారం మాకెంత మాత్రం ముఖ్యం కాదు బిజెపి పార్టీ నుండి ప్రకటన వచ్చింది.  దాంతో ముఫ్తీ సర్కారు దిగివచ్చింది.

అయితే, ఆలం విషయంలో ప్రజా రక్షణ చట్టాన్ని(పీఎస్‌ఏ) మళ్లీ ప్రయోగించే వీలు లేనందువల్లే అతడు విడుదలైనట్లు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. సుప్రీం తీర్పు ప్రకారం ఈ చట్టంకింద ఎవరినైనా గరిష్ఠంగా ఆరు నెలలు నిర్బంధించవచ్చునని, అటుపైన ఒకసారి మాత్రమే పొడిగించే వీలుంటుందని వివరించింది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా జాతీయ భద్రతకన్నా సంకీర్ణంలో కొనసాగడం తమకు ముఖ్యం కాదని ఘజియాబాద్‌లో ప్రకటించారు.  కశ్మీర్‌ సీఎం మరో 800 మందిని విడుదల చేయనుందన్న వార్తలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు  వివరణ కోరాయి. అలాంటిదేమీ లేదని, ప్రభుత్వ వైఖరిని ప్రధాని, హోంశాఖ మంత్రి ప్రకటించారని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఉభయసభల్లో స్పష్టం చేశారు. అలా ప్రస్తుతానికి రాజకీయ ఖైదీలను విడుదల చెయ్యడం లేదని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pdp  bjp  jammu  kashmir  national security  central govt  home minister  masat alam  mufti  alliance  

Other Articles