Bjp pdp in jammu kashmir

jammu. kashmir, pdp, bjp, Masrat Alam, mufti muhamad, parliament, rajyasabha,

jammu kashmir Chief Minister Mufti Muhammad Sayeed ordered the release of top APHC leader Masrat Alam, who spearheaded the stone-pelting agitation in the Valley in 2010, after four-and-a-half years in detention

పిడిపి-భాజపా కూటిమికి బీటలు

Posted: 03/09/2015 08:54 AM IST
Bjp pdp in jammu kashmir

పట్టుమని పదిహేను రోజులు కూడా కానేలేదు, బాలారిష్టలు కూడా తీరనే లేదు. కానీ అప్పుడే జమ్మూ,కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పిడిపి, బిజెపిల మధ్య విభేదాలు తలెత్తాయి. హురియత్ నాయకుడు మసరత్ ఆలంను విడుదల చేయటంతో ఈ రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తింది. జమ్మూ,కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి పాకిస్తాన్, హురియత్‌తోపాటు పలు ఇతర సంస్థలకు దోహదపడ్డాయని ముకఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ పదవి చేపట్టిన రోజే ప్రకటించటంతో రెండు పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. పిడిపి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఆలం విడుదల గురించి తమతో చర్చించలేదని బిజెపి నాయకులు అంటున్నారు. పిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సహించేది లేదని బిజెపి చెబుతోంది. కాగా పిడిపి  మాత్రం కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారమే మసరత్ ఆలంను విడుదల చేశారని వాదిస్తొంది.

 పిడిపి-బిజెపి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన గంటలోనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు రాష్ట్ర ప్రజలకు, భద్రతా దశాలకు, ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి బదులు వేర్పాటువాదులు, టెర్రరిస్టులు, పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ముఫ్తీ మహమ్మద్ చేసిన ప్రకటన  పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేసింది. తాజాగా మసరత్ ఆలం విడుదల బిజెపిని మరోసారి కష్టాల్లో పడవేయనున్నది. మసరత్ ఆలం విడుదలపై బిజెపిని పార్లమెంటులో నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దేశద్రోహులు విడుదల అవుతుంటే మీ దేశభక్తి ఏం చేస్తోందని ప్రతిపక్షం పార్లమెంటులో ప్రశ్నించనున్నది. ముఫ్తీ సరుూద్ తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల బిజెపి అధినాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఇలాగే వ్యవహరిస్తూ పోతే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని వారంటున్నారు. 2010లో రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లో భారత వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన హురియత్ నాయకుడు మసరత్ ఆలం విడులపై అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. మసరత్ ఆలం విడుదలపై ప్రభుత్వం ప్రతిపక్షాల దాడిని ఎలా తిప్పికొడతాయో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu. kashmir  pdp  bjp  Masrat Alam  mufti muhamad  parliament  rajyasabha  

Other Articles