Pawan kalyan press meet on ap capital city controversy

pawan kalyan, pawan press meet, bethampudi village,

pawan kalyan bethampudi press meet ap capital city controversy : Pawan kalyan press meet in bethampudi village about ap capital city and farmers problems.

అధికారం కోసం కాదు ప్రజల కోసం..పవన్ కళ్యాణ్

Posted: 03/06/2015 12:01 PM IST
Pawan kalyan press meet on ap capital city controversy

తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. రాజధాని గ్రామాల్లో నిన్న పర్యటించిన ఆయన తాజాగా మీడియా సమావేశం ఏర్పటు చేశారు. అందులో ఆయన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా అంశాలపై మాట్లాడారుే. తాను ఎవరకీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అధికారం కోసం కాదు అని, ప్రజల కోసం అని తెలిపారు. రాజధాని భూముల దగ్గరి నుండి రాష్ట్ర విభజన, ఏపికి ప్రత్యేక హోదా వరకు అన్ని అంశాలను పవన్ ప్రస్తావించారు. పవన్ ప్రెస్ మీట్ హైలెట్స్..

* ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి మాట్లాడలేదు.
*నాకు ఎవరితోనూ విభేదాలు లేవు
* చిన్న రైతులు తమ వద్ద నుండి పొలాలను తీసుకోవద్దని అంటున్నారు.
* పెద్ద రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనరు.
* హైదరాబాద్ లో సేకరించిన భూమి ఇంకా ఖాళీగానే ఉంది
* అభివృద్ది రాజకీయ నాయకులకా, రైతులకా ?
*సింగపూర్ కంటే ఏపి రాజధాని భూమి ఎక్కువ.
*90శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని మంత్రులు తెలిపారు.
*వ్యవసాయం చెయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
*మూడు పంటలు పండే భూములను ఇచ్చందుకు రైతులు సిద్దంగా లేరు.
*ఇప్పటికే మూడు సార్లు తమ భూములను ఇచ్చామని బేతంపూడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
*32 వేల ఎకరాల భూములను సేకరిస్తే అవి, ఎప్పటికి అభివృద్ది చెందుతాయి.
*భూమిని సేకరించడం వల్ల వచ్చే నష్టాలను అంచనా వేశారా?
*మోదీని కలిసినపుడు రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి తీసుకురావద్దని కోరాను
*చంద్రబాబు పాలనా విధానం బాగుందనే ఎన్నికల్లో మద్దతుగా నిలిచాను
*రాజధాని కోసం భూములను సేకరించడం తప్పు కాదు, కానీ ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అన్నదే ప్రశ్న.
*భూములు ఇచ్చిన తర్వాత గ్యారంటీ ఎలా ఉంటుందని ప్రశ్నలు వచ్చాయి.
*రాష్ట్ర విభజన సరిగా జరగలేదు
*పొలాలపై ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డారు
*గోరేటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుందో పాట..సెజ్ ల గురించి పాడారు
*ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజి సరిపోవడం లేదు.
*నాయకులు చేసిన తప్పుల ప్రభావం ప్రజలపై పడుతోంది.
*కొందరి ఏడుపులు రాజధానికి మంచివి కావు
*నేను పోరాటం చేస్తే అభివృద్ది నిరోధకుడినంటూ నన్ను జైల్లో పెడతారు
*సింగపూర్ లో కమిట్ మెంట్ లీడర్ షిప్ ఉంది కానీ మన దగ్గర తీవ్ర అవినీతి రాజకీయాలు ఉన్నాయి
*పెద్ద మనుషుల ఒప్పందాన్ని సరిగా పాటించకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవాల్సి వచ్చింది
*సింగపూర్ లో సంపన్నమైనది అక్కడి ప్రభుత్వమే
*సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించాలని అనుకోవడం మంచి విషయమే.
*సింగపూర్ రాజధాని నిర్మాణానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది
*సెజ్ లను మంచి కోసం ఉద్దేశించినా ఎంత మంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు
*స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చిన వారికి ఎలాంటి రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తారో వివరించాలి.
*గాంధీజీ కోరుకున్న గ్రామస్వరాజ్యం కావాలి కానీ గ్రామాలను చిదిమెయ్యవద్దు
*ఇది అధికారం కోసం పోరాటం కాదు ప్రజల కోసం పోరాటం.
*ఆ మూడు గ్రామాల కోసం ప్రత్యేక కమిటి వెయ్యాలి
*సేకరించిన భూమి ఎంత వరకు రైతులకు ఉపయోగపడుతుంది?
*మోదీ తీసుకువచ్చిన భూసేకరణ బిల్లు కొన్ని వర్గాల వారిని మరిచింది
*మురళీ మోహన్ లాంటి వ్యక్తులు భూములు కోల్పోతే పర్లేదు కానీ రైతులు భూములు కోల్పోతే తట్టుకోలేరు
*విధివిధానాలు మార్చండి అని నేను చెప్పడం లేదు.
*సెజ్ లను ఏర్పాటు చేసే సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
*ఏపిలో 40శాతం తీరప్రాంతం ఒకరి చేతిలోనే ఉంది.
*సెజ్ లపై ఎంత పోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది.
*సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోకపోతే సంక్షోభం వస్తుంది
*ఏపికి ప్రత్యేక హోదా కల్పించకపోతే బిజెపి విఫలమైనట్లే.
*వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోతే మా పరిస్థితి ఏంటని రైతుల ప్రశ్న.
*ప్రత్యేక హోదా కోసం ఏపి ఎంపీలు పోరాటం చెయ్యాలి
*పారిశ్రామికి విధానం అంటే రైతులను కూలీలుగా మార్చే విధానం ఉండకూడదు

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan  pawan press meet  bethampudi village  

Other Articles