Sonia gandhi rahul gandhi holiday trip priyanka gandhi secretary issue

sonia gandhi news, parliament of india, rahul gandhi holiday trip, priyanka gandhi updates, rahul gandhi latest news, priyanka gandhi latest news, rahul gandhi controversies, sonia gandhi controversies

sonia gandhi rahul gandhi holiday trip priyanka gandhi Secretary Issue : Sonia gandhi rejected to give answer on priyanka gandhi's position and rahul gandhi's holiday trip.

‘రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లాడో..?’

Posted: 03/02/2015 07:13 PM IST
Sonia gandhi rahul gandhi holiday trip priyanka gandhi secretary issue

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం సెలవుల్లో వున్న విషయం తెలిసిందే! ఇటీవలే ఆయన హాలీడే ట్రిప్ లో వున్న ఫోటోస్ కూడా విడుదలై పెద్ద సంచలనమే రేపాయి. ఓవైపు కేంద్రం బడ్జెట్ వివరాలను తెలుపుతుంటే.. రాహుల్ తనకేమీ తెలియదన్నట్లుగా హాలిడే ట్రిప్ కి వెళ్లడమేంటని ప్రశ్నలను లేవనెత్తారు. అంతెందుకు.. సొంత పార్టీ నాయకులే రాహుల్ ట్రిప్ పై మండిపడ్డారు.

వెంటనే ఆయన్ను ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో ప్రియాంక గాంధీని పార్టీలో కార్యదర్శిగా ప్రవేశపెట్టాల్సిందిగా సొంత పార్టీ నాయకులు సోనియాను డిమాండ్ చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నుంచి వాళ్లు ఈ విధంగానే నినాదాలు చేసుకుంటూ వచ్చారు కానీ.. ఇప్పుడు సోనియాపై మరింతగా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శిగా చేరనున్నారనే ప్రచారాలు వచ్చాయి. అయితే.. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు మాత్రం సోనియా గాంధీ నిరాకరించారు.

సోమవారం పార్లమెంటుకు వచ్చిన సోనియాను మీడియా ఒక్కసారిగా చుట్టుముట్టి ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రియాంక విషయంలో తానేమీ వ్యాఖ్యానించనంటూ చెప్పేశారు. ఇక రాహుల్ గాంధీ సెలవుపై మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ఎక్కడకు వెళ్లారో ఆయన వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది’’ అని చెప్పేసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఆ ఇద్దరి విషయాలపై సోనియా క్లారిటీ ఐతే ఇవ్వలేదు కానీ.. ప్రియాంక ఎటువంటి పదవులనూ పొందబోరని ఆమె కార్యాలయవర్గాలు మాత్రం స్పష్టం చేశాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  rahul gandhi holiday trip  priyanka gandhi issues  

Other Articles