Ganagula kamalakar counter attck on revanth reddy

gagulakamalakar, revanth reddy, trs, karimnagar, abuse, ttdp, mining, missionkaktiya

ganagula kamalakar counter attck on revanth reddy. gangulakamalakar warns to revath reddy for his statements. revanth tried to get karimnagar mining rights, but he failed and now he attck on trs added.

రేవంత్ రెడ్డి ఓ పిచ్చి కుక్క: గంగుల కమలాకర్

Posted: 02/28/2015 09:08 AM IST
Ganagula kamalakar counter attck on revanth reddy

తమ పార్టీ ప్రతినిధులపై, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలను చేస్తూ పిచ్చికుక్కలా మొరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చిరిస్తున్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎంగిలి మెతుకులకు ఆశపడి, సమైక్యవాది ముసుగులో పసలేని ఆరోపణలు చేసి ప్రశాంతంగా ఉన్న వాతావారణాన్ని చెడగొట్టవద్దని సలహా ఇచ్చారు. ఇన్నాళ్లు నువ్వు మారతావని ఆశించామని ఆయన అన్నారు. ఇకపై ఎక్కడైనా పిచ్చికుక్కలా మొరిగినా, అసందర్భ ఆరోపణలు చేసినా జరిగే పరిణామాలకు బాధ్యత నీదే బాధ్యత అన్నారు. ఒక నాయకుడి మెప్పుకోసం పెంపుడుకుక్కలా మారి సింహాన్ని అనుకుంటున్నావ్. మేం కనుసైగ చేస్తే మాడిమసైపోతావ్‌ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

గనులశాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, మిషన్ కాకతీయ గురించి రేవంత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.  కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారం చేయాలని నువ్వు ప్రయత్నిచలేదా అని, రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలిపారు.  హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బినామీపేర్లతో నిబంధనలకు విరుద్ధంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసి అడ్డదారి లో ఆస్తులు సంపాదించారని విమర్శించారు. ఫ్లెక్సీల దుకాణంతో మొదలైన నీ బతుకును బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాల వైపు మళ్లించి కోట్లు గడించింది చాలడం లేదా అని అన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gagulakamalakar  revanth reddy  trs  karimnagar  abuse  ttdp  mining  missionkaktiya  

Other Articles