Bjp pdp to form govt in jammu kashmir

bjp, pdp, jammu kashmir, new govt, afspact, atricle 370, kashmir assembly

The BJP and the People's Democratic Party on Tuesday finalised their deal over the coalition government they will now lead in Jammu and Kashmir, two months after the state threw a fractured verdict. Sources in the two parties said the next government, to be headed by PDP veteran Mufti Mohammed Sayeed with the BJP's Nirmal Singh as his deputy, will be sworn in at Jammu University's Zoravar Auditorium on March 1.

జమ్ము కాశ్మీర్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

Posted: 02/24/2015 03:04 PM IST
Bjp pdp to form govt in jammu kashmir

జమ్ము కాశ్మీర్ లోసందిగ్దతకు తెర పడింది. రెండు నెలలుగా సాగుతున్న చర్చలు తుది రూపానికి వచ్చాయి. భాజపా, పిడిపి పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాయి. అయితే పిడిపి భాజపాకు కొన్ని నిబంధనలు విధించింది. దాంతో చర్చల ప్రక్రియ మందగించింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత భాజపా జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదటుపెట్టింది. అందులో భాగంగా బిజెపి ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన కనీస మద్దతును పిడిపి నుండి ఆశిస్తోంది.

బిజెపి, పిడిపి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిగా ముఫ్తి మహ్మద్ సయీద్, ఉప ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన నిర్మల్ సింగ్ లు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. జమ్ము కాశ్మీర్ యూనివర్సిటి ఆడిటోరియంలో మార్చ్ ఒకటో తేదిన జమ్ము కాశ్మీర్ కొత్త ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. మొత్తం 14 మందితో కూడిన మంత్రివర్గం మార్చ్ ఒకటో తేదిన ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. జమ్ము కాశ్మీర్ హోం మంత్రిగా అబ్దుల్ రెహమాన్ పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తానికి పిడిపి, భాజపా మధ్య పొత్తు కుదిరి జమ్ము కాశ్మీర్ లో కొత్ ప్రభుత్వం కొలువుదీరనుంది.

ఎన్నికల్లో భాజపా పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేకపొయింది. అయితే పిడిపి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి భాజపా ముందుకు రాలేదు. అయితే ఢిల్లీ ఎన్నికల తర్వాత కాశ్మీర్ ను వదులుకునే ఉద్దేశం లేని భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే పిడిపి భాజపా నుండి కొన్ని స్పష్టమైన హామీలను కోరింది. ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, ఆర్టికల్ 370 పై భాజపా క్లారిటీ ఇవ్వాలని కోరింది. అయితే ఆర్మీకి అనుకూలంగా ఉన్న చట్టాన్ని సవరించాలన్న పిడిపి డిమాండ్ పై భాజపా సందిగ్దంలో పడింది. అయితే ప్రస్తుతం భాజపా25 సీట్లుచ పిడిపి 28 సీట్లను కలిగి ఉంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  pdp  jammu kashmir  new govt  afspact  atricle 370  kashmir assembly  

Other Articles