Rss support to mohan bhagath

mohanbhagath, rss, parliament, sessions, opposition, congress, kejriwal, mother teresa,

Converting people to Christianity was Mother Teresa's motive for helping people - this controversial comment by the Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat left the government facing opposition fury in Parliament today.

ఆ వ్యాఖ్యలను సమర్థించిన ఆర్ఎస్ఎస్..పార్లమెంట్ లొ కడిగేసిన విపక్షాలు

Posted: 02/24/2015 01:39 PM IST
Rss support to mohan bhagath

మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ సమర్థించింది. మదర్ థెరిస్సా మిషనరీలు చేస్తున్న సేవ అనుమానాస్పందంగా ఉందన్నారు. ఎన్జీవోలు చేస్తున్న సేవల గురించి వ్యాఖ్యలు చేశారని, దాన్ని మీడియా వక్రీకరించిందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి వైద్య తెలిపారు. అదేసమయంలో భగవత్ వ్యాఖ్యలను మీడియా తప్పుగా పేర్కొందని, వాస్తవాలను వక్రీకరించిందని ఆర్ఎస్ఎస్ అంటోంది. మరోవైపు భగవత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంఘ్ ఒకటి చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొకటి చెబుతున్నారని కాంగ్రెస్ మండిపడింది. ఈ మాటలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. అయితే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మదర్ ధెరిస్సాపై ఆరోపణలు చేస్తున్న సంఘ్ నేతలు తమ పిల్లలను మిస్సోరి నుండి తీసుకువస్తారా అని, కిరణ్ బేడి తమ వారికి అర్థం అయ్యేలా చెప్పాలని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

మరో పక్క పార్లమెంట్ సమావేశాల్లోనూ మోహన్ భగత్ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించాయి. అధికారపక్ష పార్టీకి తమ మాతృసంస్థ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఎవరూ ఖండించలేదని ఆరోపించాయి. మదర్ ధెరిస్సా ఒక దేశానికే కాదు, ప్రపంచానికి ఎంతో ఆదర్శనీయం అని, అలాంటి వ్యక్తిని కించపురుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఏంటని కాంగ్రెస్ ఎంపి జోతిరాదిత్య ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇలాంటి వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి ఆ సంస్థలకు ఎలాంటి సంబందం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. మొత్తానికి మోహన్ భగత్ మాటలు దేశంలో సంచనాన్ని సృష్టించాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohanbhagath  rss  parliament  sessions  opposition  congress  kejriwal  mother teresa  

Other Articles