Abhinav akkineni akhil fake account girl trapping

akkineni akhil facebook, abhinav facebook fake accounts, abhinav akkineni akhil facebook, abhinav news, abhinav case

abhinav akkineni akhil fake account girl trapping : A girl beated a boy named abhinav for trapping girls through facebook with akkineni akhil fake account.

‘ఫేక్’బుక్ ‘అక్కినేని అఖిల్’ని దేహశుద్ధి చేసిన యువతి

Posted: 02/16/2015 08:47 PM IST
Abhinav akkineni akhil fake account girl trapping

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే! ఇటీవలే ఇతనిని అభిమానులకు పరిచయం చేస్తూ ఓ ఫంక్షన్ ను కూడా నిర్వహించారు. అలాగే వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ని కూడా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించారు. అయితే.. ఇతని సినిమా ఇంకా రాకముందే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విశేషంగా వుంది. ఇంకా రానురాను మరింతగా పెరిగిపోతోంది కూడా!

ఈ క్రమంలోనే అభినవ్ అనే యువకుడు సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ పేరిట ఓ అకౌంట్ క్రియేట్ చేశాడు. దాంతో అతగాడు మోసాలకు తెరదీశాడు. అతడు ప్రతిరోజూ అఖిల్ కి సంబంధించిన అన్ని విషయాలు అప్ డేట్ చేస్తుండటంతో... అది నిజంగానే అఖిల్ అకౌంట్ అని భావించిన అమ్మాయిలు ఆ ఫేక్ అకౌంట్ కు ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితులైన అమ్మాయిలను అభినవ్ మోసం చేస్తూ వచ్చేవాడు. అయితే.. ఇతని మోసాన్ని పసిగట్టిన ఓ అమ్మాయి ఇతడి గుట్టును రట్టు చేసింది.

సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న అభినవ్ ను ఓ యువతి రట్టు చేయడమే కాకుండా అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసింది. అంతేకాదు.. హైదరాబాద్ కెపిహెచ్ బీ పోలీసులకు అప్పగించింది కూడా! ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil facebook  abhinav facebook fake accounts  

Other Articles