Amith sha pdp to form new govt in kashmir bjp and pdp maybe form the govt

amith sha, pdp, pdp support bjp, bjp form govt in kashmir

amith sha pdp to form new govt in kashmir. bjp and pdp maybe form the govt.after the delhi elections bjp president decided to form the govt. in kasmir. bjp discussing about this issue and positive responce from both.

ఆపరేషన్ కాశ్మీర్...ప్రారంభించిన అమిత్ షా

Posted: 02/06/2015 05:35 PM IST
Amith sha pdp to form new govt in kashmir bjp and pdp maybe form the govt

ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆప్, బిజెపి పార్టీలు శక్తివంచన లేకుండా కష్టపడ్డాయి. అయితే ఇక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పే తరువాయి. కాగా ఢిల్లీలో ఎన్నికల తరువాత కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. వాటిని బలపరుస్తు కాశ్మీర్లో పిడిపితో బిజెపి చేస్తున్న చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయని బిజెపి అధ్యక్షులు అమిత్ షా ప్రకటించారు.

డిసెంబర్ లో జరిగిన కాశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు వీలుకాలేదు. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. కానీ ప్రస్తుతం పిడిపి పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి మద్దుతుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇదే గనక నిజమైతే కాశ్మీర్లో భాజపా అధికారాన్ని దక్కించుకున్నట్లవుతుంది. భాజపాకు అధికారాన్ని అందించే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి అమిత్ షా సిద్దంగా లేరు. ఏ ఎండకా గొడుగు అన్నట్లు వ్యవహరిస్తున్నారు భాజపా అధ్యక్షులు అమిత్ షా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amith sha  kashmir govt  pdp party  form govt in kashmir.  

Other Articles