Sanjay dutt in mumbai furlough extention result awaited

Sanjay Dutt jail, Sanjay Dutt in Mumbai, Sanjay Dutt latest, Sanjay Dutt furlough, Sanjay Dutt movies, Sanjay Dutt upcoming movies, Sanjay Dutt jail life, Sanjay Dutt latest, furlough, Indian Constitution loop holes, prisioners rights in India. Erawada Jail, 1993 Mumbai blast case

Sanjay Dutt in Mumbai, furlough extention result awaited : Fans called Munna Bhai enjoys jail and home life at same time with Indian Constitution rules. Sanjay Dutt return to jail after his Furlough ended on thursday but after home minister comments kalnaik went back to mumbai home

చట్టం సంజయ్ కు దగ్గరి చుట్టం !

Posted: 01/09/2015 01:14 PM IST
Sanjay dutt in mumbai furlough extention result awaited

చట్టం తన పని తాను చేసుకుపోతుంది.., చట్టం ఎవరికి చుట్టం కాదు అని సినిమాల్లో డైలాగులు చూశాము కానీ.., అయిన వారికి చట్టం చుట్టమే అవుతుందని కల్నాయక్ ను చూస్తే తెలిసిపోతుంది. ముంబై పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష పడగా.., పది రోజలు ఇంట్లో, పది రోజులు జైల్లో అన్నట్లుగా గడుపుతున్నారు. జైలు జీవితంలో కూడా ఇంత సుఖం ఉంటుందా అని సంజయ్ ను చూస్తేనే అర్థమవుతుంది. చట్టంలోని లూప్ హోల్స్ ను మున్నాభాయ్ అంతలా వాడుకుంటారు. బోర్ కొడితే చాలు పెరోల్ పేరు చెప్పి బయటకు వచ్చి కుటుంబంతో గడుపుతున్నాడు. మళ్ళీ జైలుకెళ్ళి, కొద్దిరోజులు ఉంటాడు. బోర్ కొడితే మళ్ళీ ఏదో ఒక పేరుతో అప్లికేషన్ పెట్టడం, అది అనుమతి పొందటం, భాయ్ బయటకు రావటం ఇదంతా ఏడాదిగా జరుగుతున్న తంతు.

తాజాగా మున్నభాయ్ మరోసారి ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ సారి చెప్పిన కారణం ఏమిటంటే.., తాను పెట్టుకున్న పిటిషన్ పెండింగ్ లో ఉండటమేనట. అనారోగ్యం కారణంగా ఫర్లాగ్ (సెలవులాంటిది) పేరుతో మున్నబాయ్ 15 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. గడువు పూర్తి అయ్యే లోపే ఫర్లాగ్ పొడగించాలని కోర్టును కోరాడు. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోకపోవటంతో ఇంట్లో వారికి గుడ్ బై చెప్పి ఎరవాడ జైలుకు బయల్దేరాడు. అయితే జైలుకు వెళ్లే ముందుగా, పిటిషన్ విచారణలో ఉన్నందున సంజయ్ ప్రస్తుతం లొంగిపోవాల్సిన అవసరం లేదని హోంమంత్రి చెప్పారు. ఇంకేముంది వచ్చిన కారులోనే మళ్ళి ఇంటికెళ్లి.., ఐయామ్ బ్యాక్ అన్నారు.

సంజయ్ ఫర్లాగ్ పై స్పందించిన పోలిసులు.., ఆయన అనారోగ్యం నిజమో కాదో విచారణ జరుపుతున్నామన్నారు. నివేదిక వస్తేనే ఫర్లాగ్ పొడగించాలా.. లేదా అనే విషయం ప్రకటిస్తామన్నారు. ఫర్లాగ్ కాకుంటే ఇంకొకటి.., మనసుంటే మార్గం ఉండదా అన్నట్లుగా.., బయటకు రావాలని ఉంటే కారణం దొరకదా అని విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. చట్టంను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నా ఏమి చేయలేకపోతున్నాం అంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ అని మేధావులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Erawada Jail  Furlough  

Other Articles