Pm modi to inaugurate 102nd indian science congress today

Indian Science Congress. Indian Science Congress 102, Indian Science Congress mumbai, prime minister inaugurated indian science congress, Indian Science Congress last day, Indian Science Congress starts today, when will start Indian Science Congress, Indian Science Congress 103

The 102nd session of Indian Science Congress (ISC) will be inaugurated by Prime Minister naredra modi

నేటి నుంచి భారత సైన్సు కాంగ్రెస్

Posted: 01/03/2015 10:08 AM IST
Pm modi to inaugurate 102nd indian science congress today

ముంబై విశ్వవిద్యాలయం వేదికగా 102 వ భారత సైన్సు కాంగ్రెస్ శనివారం ముంబై లో ఆరంభమవుతుంది. ఈ అత్యద్భుతమైన సైన్సు పనుడుగాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పలు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై విస్తృత చర్చలు జరుగుతాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పరిశోధన పత్రాలు సమర్పిస్తారు. ఈ నెల 7 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

దాదాపు 45 ఏళ్ళ విరామం తర్వాత ముంబై లో సైన్సు కాంగ్రెస్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నగరానికి దేశానికి ఆర్ధిక రాజధనిగానే కాకా సైన్సు సిటీగా గుర్తింపు పొందేలా చూడాలన్నది లక్ష్యమని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. ఆ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముంబై యూనివర్సిటీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. ముంబై లో ఉన్న టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బాబా అణు పరిశోదన కేంద్రం, ఐ ఐ టి, టాటా మెమోరియల్ సెంటర్ వంటి అగ్రశ్రేణి పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇవ్వన్ని సైన్సు కాంగ్రెస్ లో పాలు పంచుకోబోతున్నాయి. ఇందులో ప్రముఖ శాస్త్రవేత్తలను, పరిశోధక విద్యార్థులను ఒకే వేదిక పైకి తీసుకురావటం ద్వారా సైన్సు పట్ల ఆసక్తి ని పెంచాలని చూస్తున్నారు.

ఈ సదస్సుకు విచ్చేస్తున్న ముఖ్య అతిథితుల్లో 2001 వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత కర్ట్ వుత్ రిచ్ (స్విట్జర్లాండ్), 2009 లో రసాయన శాస్త్రంలో ఈ పురస్కారాన్ని అందుకున్న యాడా ఇయోనాథ్ (ఇజ్రాయిల్), 2013 లో వైద్య శాస్త్రం లో నోబెల్ బహుమతి పొందిన రాండి షేక్మన్ (అమెరికా) లతో పాటు, నోబెల్; శాంతి బహుమతి గ్రహీతలు ఖైలాష్ సత్యర్తి, మహ్మద్ యూనస్ కూడా పాల్గొనబోతున్నారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Science Congress  prime minister narendra modi  mumbai  

Other Articles