One rupee note set to make a come back

One rupee note, one rupee note come back, one rupee note after 20 years, finance ministry brings one rupee note, pink green coloured one rupee note, finance secretary signs one rupee note, Government of india one rupee note, bharat sarkar one rupee note

Well, it is all set to make a come back after 20 long years, albeit with a new look.

పునరాగమనానికి సిద్దమైన రూపాయి నోటు

Posted: 12/27/2014 08:54 PM IST
One rupee note set to make a come back

రూపాయి నోటు చూస్తే ఈ తరం పిల్లలు అది అడుకునే వస్తువుగానే పరిగణిస్తారు. ఎందుకంటే అలా వంకార రంగులో వుండే కరెన్సీ నోటు వారు చూడలేదు కాబట్టి. అయ్యే ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. ఈ తరం వారు అసలు రూపాయి నోటునే చూడలేదంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వారికి తెలిసిన రూపాయి కేవలం నాణేమే.. అదేనండి కాయిన్ మాత్రమే.. ఇప్పటికే పావలా, అర్థరూపాయి నాణేలను చెలామణిలో లేకుండా పోవడంతో.. మరో కొన్ని సంవత్సారాల్లో రూపాయి నాణేం కూడా చెలామణి నుంచి పోతుందని ఊహాగానాలు వస్తున్న తరుణంలో కేంద్రం ఓ సంతోషకరమైన వార్తను అందించింది.

అదే రూపాయి నోటు పునరాగమనం. సరికొత్త హంగులు, అకర్షనీయమైన వర్ణాలతో మరోసారి రాబోతోంది. 20 ఏళ్ల తర్వాత రూపాయి నోటును ముద్రించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రిత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ అధికారి మాట్లాడుతూ.. ఈ రూపాయి నోటుపై వాడే ఇండిగో రంగు బదులుగా గులాబీ, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో నోటును ముద్రించనున్నట్టు తెలిపారు. ఈ నోటుపై రిజర్వు బాంకు గవర్నర్ కు బదులుగా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేయనున్నారన్నారు. కాగా మిగిలిన నోట్లపై యాధాతథంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం చేస్తారు.

రూపాయి నోటుపై అన్ని నోట్లకు ఉన్నట్లుగా రిజ్వరు బ్యాంకు అఫ్ ఇండియాకు బదులుగా గవర్నమెంట్ అఫ్ ఇండియా అని ముద్రించనున్నారు. ఇక హిందీలోనూ 'భారత్ సర్కార్', పేర్లను ముద్రిస్తారు. అలాగే దేశంలోని 15 భాషల్లో రూపాయి విలువను నోటుపై మద్రించనున్నారు. మరీ అంత తొందర పడకండీ.. కొన్ని రోజులు అగితే.. మనుగడలోకి వస్తుంది.. అప్పుడే మీ చెంతకు చేరుతుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : One rupee  note  currency  come back  

Other Articles