Jharkhand election results bjp won

jharkhand election results, jharkhand elections, jjharkhand assembly elections result, jharkhand pdp party results, total seats in jharkhand, jharkhand bjp party, arjun munda, arjun munda defeated by jmm and madhu koda defeated by jmm

jharkhand election results out bjp going to form the government

మాజీ సి.ఎంలు మాకొద్దని తేల్చిన జార్ఖండ్ ప్రజలు

Posted: 12/23/2014 04:14 PM IST
Jharkhand election results bjp won

ఆయన ఒకప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆ రాష్ట్ర భాజపాలో కీలక పాత్ర పోషించిన అర్జున్ ముండ ఇప్పుడు దిక్కి తోచని పరిస్థితిలో పడిపోయారు. ప్రస్తుతం వెలువడ్డ ఎన్నికల ఫలితాలలో అర్జున్ ముండ భారి ఓటమి ని చవి చూడాల్సి వచ్చింది. ఖర్ సవాన్ నుండి జే.ఎం.ఎం అభ్యర్థి గగ్రాయ్ గెలుపొందారు.  ఇప్పుడు అర్జున్ ముండా గెలిచుంటే ఆయన ముఖ్యమంత్రి పీఠము రేసు లో ఉండేవాడు కాని ముండ ఓటమి తో ఇప్పుడు బి జె పి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అర్జున్ ఓడిపోవటానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేనప్పటికీ, అతని నియోజక వర్గం లో మాత్రం అతనిపై కొంత వ్యతిరేఖత మాత్రం వ్యక్తమైంది. నియోజక వర్గ అభివృద్ధి పై ద్రుష్టి పెట్టట్లేదని, కొంత కాలంగా అసలు నియోజక వర్గం వైపే చూడలేడనే విమర్శలు ఉన్నాయి. అందుకే నియోజక వర్గ ప్రజలు ఆ స్థాయి లో తీర్పిచ్చారని అంతా చర్చించుకుంటున్నారు.

మధు కోడ విష్యం ఇప్పటికే ఆయనపై సిబిఐ కేసులు బోలెడు ఉన్నయి. ఇటీవలే ఆయనపై చబిల్ కొత్తగా నాలుగు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఆ మధ్య ఆరెస్ట్ కూడా అయ్యాడు. బొగ్గు కుంభకోణాల్లో మసి పట్టి ఉన్న ఆ మాజీ సి ఎం తర్వాత బెయిలు మీద వచ్చి ఝార్ఖండ్ ఎన్నికలలో పాలు పంచుకున్నాడు. ఝార్ఖండ్ లోని మజాగావ్ నియోజక వర్గం నుండి పోటి చేసిన మధు కోడా..., జే ఎం ఎం అభ్యర్థి చేతిలో 11500 ఓట్లతో పరాజయం పాలయ్యాడు. ఏది ఏమైనా జార్ఖండ్ లో ఇద్దరు అగ్ర నేతలు ఈ ఎన్నికల ఫలితాలలో అడ్రస్సు లేకుండా గల్లంతయ్యారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand  election results  arjun munda  madhu koda  

Other Articles