Nh 65 has become a way of death

NH 65 road accident, road accident on national Highway, average accidental deaths per year , 1000 deaths per year on NH 65, heavy loss of life on NH 65, more accidents in Nalgonda, NH 65 Hyderabad vijayawada highway, national Highway 65

NH 65 has become a way of death as average road accidents on national Highway records 1000 deaths per year

మృత్యుకేళి: ఏడాదికి 1000 మందిని బలితీసుకుంటోంది..

Posted: 12/07/2014 07:08 PM IST
Nh 65 has become a way of death


వినడానికే ఆశ్చర్యకరంగా వున్నప్పటకీ .. ఇది నమ్మలేని నిజం. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో జరుగుతున్న ప్రమాదాలకు ఆ రోడ్డు నెలవుగా మారింది, ఫలితంగా ఏడాదికి సగటున వెయ్యి మంది ప్రాణాలను మృత్యు రహదారి బలితీసుకుంటోంది. రోడ్డు విస్తరణకు ముందు రద్దీతో అనేక చోట్ల ట్రాఫిక్ స్థంబింపజేసిన ఈ రోడ్డు.. నాలుగు లేన్ల విస్తరణ తరువాత.. కిల్లర్ రహదారిగా మారింది. హైదరాబాద్- విజయవాడ మధ్య నిర్మించిన 65వ నెంబరు జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారుతోంది. నాలుగు వరసల విస్తరణతో ఉన్న 65 నెంబరు రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే అవి కూడా నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం.

అతివేగం.. అభద్రత: 65వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండ జిల్లాలో 181 కి.మీ. పొడవుతో నాలుగు లైన్ల రహదారి ఉంది. దీనిపై వాహనాలు 85 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఉంది. కానీ, సగటున 125 నుంచి 150 కి.మీ. వేగంతో పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ దాటిన తర్వాత నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌కు చేరుకోగానే వాహన చోదకులు వేగం పెంచుతున్నారు. డ్రైవర్లు అతివేగంతో వాహనాలు నడపడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తప్పుడు దారిలో(రాంగ్ రూట్) వెళ్లే వాహనాలను పోలీసులు నియంత్రించడం లేదు. జాతీయ రహదారిపై హెచ్చరికలు, సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

గత కొంత కాలంగా ఈ రోడ్డుపై ప్రయాణించి ప్రమాదాలకు గురైన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను ఇలా వున్నాయి... గత ఏడాది ఇదే రహదారిపై నార్కట్‌పల్లి శివారులో టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్‌బాషా కూడా దుర్మరణం పాలయ్యారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన బాషా కారు నార్కట్‌పల్లి బైపాస్ జంక్షన్ వద్ద ప్రమాదానికి గురైంది.  2002లో చిట్యాల మండలం పెద్దకాపర్తి బస్టాండు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేమవరపు లక్ష్మీప్రసన్న, ఆమె భర్త రత్నాకర్ బాబూరావు మృతిచెందారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద గత సెప్టెంబరు 28న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ దంపతులు కూడా ప్రమాదానికి గురయ్యారు. ఘటనలో నారాయణ సతీమణి మృతి చెందారు.

2009 మార్చి 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల, హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డిలు ప్రమాదానికి గురై గాయాలతో బయటపడ్డారు. కట్టంగూర్-కేతేపల్లి మధ్య సినీ నటుడు సునీల్ ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. నిత్యం ఇలా ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 65వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ.. గత రాత్రి సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National Highway 65  hyderabad vijayawada highway  road accidents  

Other Articles