Telangana producer director rafi allegations on memu saitham

rafi on kbr park, kbr park named kcr park, director producer rafi, telangana director producer rafi, telangana directors and producres, telangana film stars details, rafi on memu saitham, tollywood latest news updates, memu saitham highlights photos

telangana producer director rafi on memu saitham and kcr name for kbr park : telangana producer and director rafi demands memu saitham programem is partial not helped telangana victims and he demands kbr park should be named as kcr park

‘మేము సైతం’ సాయం వెనక కుట్ర దాగింది

Posted: 12/01/2014 11:45 AM IST
Telangana producer director rafi allegations on memu saitham


తెలంగాణ డైరెక్టర్, నిర్మాత రఫి మరోసారి టాలీవుడ్ పెద్దలపై విమర్శలు ఆరోపణలు గుప్పించారు. తాజాగా టాలీవుడ్ నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమంపై రఫీ విమర్శలు చేశారు. ‘మేము సైతం’ సాయం వెనక కుట్ర దాగి ఉందన్నారు. తుఫానుతో ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణ కూడా దెబ్బతిన్నదనీ.., అయితే టాలీవుడ్ కేవలం ఏపీకి సాయం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం, తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల కుటుంబాలను ఆదుకునేందుకు ఇండస్ర్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు సినిమా పరిశ్రమ ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. విశాఖలో ఇండస్ర్టీని పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కొందరు పెద్దలు ఈ కార్యక్రమాన్ని వెనకుండి నడిపించారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక సమావేశంలో చివరగా హైదరాబాద్ లోని కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబిఆర్) జాతీయ పార్కు పేరును మార్చాలని డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్కును కేసీఆర్ పార్కుగా పేరు మార్చాలని ప్రభుత్వాన్ని రఫీ కోరటం విశేషం.

గతంలో ఏపీ ఫిలిం చాంబర్ తో పాటు, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ పై రఫీ పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. తాను డైరెక్ట్ చేసిన ‘ఇంకెన్నాళ్ళు’ సినిమాకు థియేటర్లు దొరక్కుండా ఇండస్ర్టీలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే., ‘మేము సైతం’ కార్యక్రమం విజయవంతం కాగా., చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులే ఇలా పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. సాయంలో కుట్ర ఉందని చెప్పటం సహేతుకం కాదన్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rafi  memu saitham  kcr  kbr park  tollywood  

Other Articles