Cricket world and fans mourns phillip hughes death

Australian Cricketer, Phil Hughes, dies, left hander, hit by ball, bouncer, St Vincent's Hospital

Australian Cricketer Phil Hughes passed away, Cricket world mourns loss of Phillip Hughes

ఫిలిప్ హ్యూస్ మృతితో విషాదంలో మునిగిన క్రికెట్ ప్రపంచం,,

Posted: 11/27/2014 05:54 PM IST
Cricket world and fans mourns phillip hughes death

ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. మంగళవారం దేశవాళీ టోర్నీ ఆడుతూ గాయపడిన హ్యూస్ మృత్యువుతో పోరాడి ఇవాళ తుదిశ్వాస విడిచాడు. మరో మూడు రోజుల్లో నవంబర్ 30న హ్యూస్ పుట్టినరోజు ఉండగా ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత్ తో బ్రిస్బేన్ లో జరిగే తొలిటెస్టులో ఆడటానికి దాదాపు మార్గం సుగుమం చేసుకున్న వేళ హ్యూస్ ఇకలేడన్న చేదు వార్త యావత్ క్రికెట్ ప్రపంచంతో పాటు క్రికెట్ అభిమానులను కూడా ఆందోళనకు గురి చేసింది.
 
ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు ఆడిన హ్యూగ్స్ తన మొదటి టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లోనే 72 పరుగులు చేశాడు. ఆ తరువాతి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అతని బెస్ట్ స్కోరు 160 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 138. అయితే అతను చేసిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ రికార్డును ఇప్పటికీ ఎవరు అధిగమించలేదు. అలాంటి అగ్రశేణి క్రికెటర్ దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తగలడంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు.

క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ మరణ వార్తతో యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. హ్యూస్ కు తలకు గాయం కావడంతో కోలుకుంటాడని అందరూ భావించారు. ఆ ఆశలను నిరాశపరుస్తూ హ్యూస్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతని మరణం నిజంగా క్రికెట్ కు ఒక గాయం.  రెండు రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ తీవ్ర్గంగా గాయపడిన హ్యూస్ మృత్యువుతో పోరాడినా.. దానిని జయించలేకపోయాడు. హ్యూస్ మరణవార్తపై పలువురు క్రికెటర్ల ట్విట్టర్లో తమ స్పందన తెలియజేశారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Hughes

హ్యస్ కు ఆత్మకు శాంతి చేకూరాలని భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రార్థించాడు. ఆ మరణవార్తను జీర్ణించుకునే శక్తి అతని కుటుంబానికి ఇవ్వాలంటూ శ్రీశాంత్ తన ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 'హ్యూస్ ఇంత తొందరగా వెళ్లిపోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు శాంతి చేకూరాలి' అని పీర్స్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఈ మరణవార్త తనను చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు.అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోహ్లీ ట్వీట్ చేశాడు. హ్యూస్ కుటుంబానికి అతని ఆత్మకు శాంతి చేకూరాలంటూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతితో పలు మ్యాచ్ లు పాక్షికంగా రద్దయ్యాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా ఎలెవన్ తో జరిగే  రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో తొలి రోజును రద్దు వేస్తున్నట్లు జట్టు మేనేజ్ మెంట్ స్సష్టం చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ను ఒక రోజు పాటు రద్దు చేస్తున్నట్లు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్, డైరెక్టర్ రవిశాస్త్రిలు ఆటగాళ్లకు తెలిపారు. దీంతో రేపు ఆరంభం కావాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ శనివారానికి వాయిదా పడింది. ఇదిలా ఉండగా పాకిస్థాస్, న్యూజిలాండ్ ల మధ్య జరిగే చివరి టెస్టు కూడా ఒక రోజు పాటు రద్దుచేశారు.షెడ్యూల్ ప్రకారం పాక్-కివీస్ ల మ్యాచ్ శుక్రవారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది. ఇరు బోర్డుల అంగీకారంతో ఆ టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజు మ్యాచ్ ను రద్దు చేశారు.
 
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు తుదిశ్వాస విడిచాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ  హ్యూస్ మంగళవారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian Cricketer  Phil Hughes  dies  left hander  hit by ball  bouncer  St Vincent's Hospital  birthday  

Other Articles