Japan to build cities in ocean

japan to build cities in ocean, city in ocean, japan cities in ocean, shimizu construction company, shimizu on cities in ocean, latest news updates, new constructed cities, new flats in hyderabad, house flat sales in hyderabad, infrastructure development

japan to build cities in ocean : a leading construcition company in japan says it will build cities in ocean, Shimizu Corporation has unveiled its template for a modern-day Atlantis city in ocean earth

ఇక పాతాళంలోనూ ట్రాఫిక్ జామ్ కష్టాలు

Posted: 11/26/2014 11:00 PM IST
Japan to build cities in ocean

మనిషి ఆశకు ఓ హద్దంటూ ఉంటుంది. అది ఆకాశం నుంచి ఇప్పుడు పాతాళానికి పాకుతోంది. అంతరిక్షంలోకి రాకెట్లను పంపి.. పొరుగు గ్రహాలపై పరిశోధనలు చేస్తున్న మానవులు, చంద్రుడిపై ఇళ్లు కట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన వార్త బయటకు వచ్చింది. టెక్నాలజి దిగ్గజం జపాన్..., ఏకంగా సముద్రంలోపల ఇళ్ళను కట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఒకటి రెండు కాదు.., ఏకంగా నగరాలనే నిర్మిస్తుందట. వినటానికే ఆశ్చర్యంగా ఉంటే.., ఆ ఆలోచన వచ్చిన, అమలు చేస్తున్నవారిని ఇంకేమనాలి.

జపాన్ భూరంగా చూస్తే., చిన్నదేశమైనా జనాభా మాత్రం ఎక్కువ. దీంతో భూముల ధరలు విపరీతంగా ఉంటాయక్కడ. ఇళ్లు కట్టుకునేందుకు కొత్త స్థలాలు కరువు కావటంతో., కొత్తగా ఆలోచన చేశారు. సముద్రం లోపల బోలెడంత స్థలం ఉంటుంది, అక్కడ కడితే ఏ గొడవ ఉండదు కదా అనుకున్నారు. ఈ ఆలోచన వచ్చింది షిమిజు అనే ప్రముఖ నిర్మాణ సంస్థకు. పెరిగే భూమల ధరలకు అడ్డుకట్ట వేయాలంటే సముద్రంగర్బంలో కాలనీలు కట్టేస్తే సరి అనుకున్నారు. అంతేకాదు ఇదంకోసం ఇప్పటికే డిజైన్ కూడా రూపొందించారు. ఇక షిమిజు సంస్థ తన వంతుగా ఈసిటీ కోసం 16 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. 2030 నాటికి ఈ నగరం నిర్మాణం పూర్తవుతుందట. అంటే మరో 15 సంవత్సరాల్లో సముద్ర సిటీ ఏర్పడనుంది.

‘అట్లాంటిస్’ పేరుతో నిర్మిస్తున్న ఈ నగరం గోళాకారంలో ఉంటుంది. కేవలం ఇళ్ళే కాకుండా హోటళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్ సౌకర్యాలు కూడా ఉంటాయట. ఈ నగరంలోకి వెళ్లి వచ్చేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తారట. అన్నీ బాగానే ఉన్నాయి కాని ఈ సిటిలో ఇంటి రేటు ఎంతో చెప్పలేదు. ఎప్పుడుపడితే అప్పుడు భూకంపాలు వచ్చే దేశమైన జపాన్ లో భూమిపై ఇళ్ళు కట్టకపోవటం అంటే ఫ్యూచర్ ప్లాన్ అనుకోవాలి కాని.., సముద్రంలోపల సిటీ అంటే ఒక్క భూకంపం వచ్చిందో ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. ఇన్ని తెలిసిన వీరు దీనికి కూడా ఏదో విరగుడు వేసే ఉంటారు. ఇన్నాల్ళు రోడ్లకే పరిమితమైన ట్రాఫిక్ జామ్ లు., ఇకపై సముద్రంలోపల కూడా అవుతాయి. అక్కడ అయిపోతే గాల్లో కూడా మేడలు కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  ocean cities  shimizu  latest news  

Other Articles