Andhra pradesh government offers to japan industrialists

andhra pradesh industries, andhra pradesh new industrial policy, andhra pradesh latest jobs, chandrababu naidu japan tour, andhra pradesh development, chandrababu naidu japan tour agreements, andhra pradesh capital update, latest telugu news updates

andhra pradesh government offers to japan industrialists : in japan tour andhra pradesh chief minister nara chandrababu naidu given offer to foreign industrialists that in one week government will give permission to establish a industry

ఏపీ తెలంగాణ మద్య పోటి షురూ... చంద్రబాబు బంపర్ ఆఫర్లు

Posted: 11/25/2014 07:53 AM IST
Andhra pradesh government offers to japan industrialists

విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటి  పడతాయని ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఓ వైపు తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించగా.., ఏపీ ప్రభుత్వం అంతకు మించిన ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా పెట్టుబడుల ఆకర్షణే ప్రదాన లక్ష్యంగా జపాన్ పర్యటన చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అక్కడి పారిశ్రామిక వేత్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో జపాన్ కంపనీలు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు.


జపాన్ పర్యటనలో భాగంగా.., వారం రోజుల అనుమతి ఆఫర్ ప్రకటించారు. తాజా ప్రకటన ప్రకారం,  విదేశీ ప్రతినిధులు కంపనీల అనుమతి కోసం ఏపీకి వచ్చిన వారం రోజుల్లో అనుమతులు వస్తాయి. ఒకవేళ అలా రాని పక్షంలో ఎనమిదవ రోజు కంపనీలు పెట్టుబడులతో  సహా వెనక్కి వెళ్లిపోవచ్చని  ప్రకటించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఎన్.ఐ.డీ.ఈ.సీ., ఎన్మార్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన  చంద్రబాబు బృందం పారిశ్రామిక అభివృద్దిపై చర్చ జరిపింది. ఈ సందర్బంగా దేశంలో పేరుకున్న అలసత్వం, నిర్లక్ష్యం  వల్ల వ్యాపారం చేయటం కష్టమవుతుందని జపాన్ వర్గాలు  ప్రశ్నించగా.., ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీకి వచ్చే కంపనీలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకటంతో పాటు  ఏడు రోజుల్లో అనుమతి  రాకుంటే తిరిగి వెళ్ళేందుకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం  పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ప్రకటించింది. దేశంలోనే తెలంగాణను పరిశ్రమల పరంగా  ఆదర్శ రాష్ట్రంగా నిలబెడతామని ఆయన హామి ఇస్తున్నారు. ఇటు  ఏడు రోజుల్లో అనుమతులు, అటు సింగిల్ విండో విధానం రెండు పోటాపోటి విధానాలే. రెండు తెలుగు రాష్ట్రాలు విమర్శలు చేసుకోవటంలో పోటితో పాటు అభివృద్ధిలో పోటి పడుతుండటం సంతోషకరమని విశ్లేషకులు అంటున్నారు.  ఇదే స్నేహపూర్వక వాతవరణం  రెండు రాష్ట్రాలు అభివృద్ధి పధంలో ముందుకెళ్ళటం ఖాయమని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  industries  japan tour  latest news  

Other Articles