Firing at kbr park assailant fired on aurobindo pharma vice chariman nityananda reddy

nityananda reddy, firing, KBR park, Aurobindo Pharma vice president

firing at kbr park, Assailant fired on aurobindo pharma vice chariman nityananda reddy

కేబీఆర్ పార్కు వద్ద కాల్పుల కలకలం..

Posted: 11/19/2014 10:58 AM IST
Firing at kbr park assailant fired on aurobindo pharma vice chariman nityananda reddy

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని, కారు ఎక్కుతున్న ఆయనపై  ఏకె 47తో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. అయితే వెంటనే తేరుకున్ననిత్యానందరెడ్డి... అతనిపై ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా 15 రౌండ్ల మేర కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల సమాచారం. అనంతరం తుపాకీ వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది.

కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఒక్కసారిగా కాల్పులతో పార్క్కు వాకింగ్కు వచ్చిన వాకర్స్ ఈ ఘటనతో భయాందోళనలకు గురయ్యారు. కాల్పుల ఘటనపై  ప్రత్యక్ష సాక్షులు ...పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు నిత్యానందరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Peoples ias officer sr sankaran
Yeddyurappa says no change in decision to quit bjp  
Rate This Article
(0 votes)
Tags : nityananda reddy  firing  KBR park  Aurobindo Pharma vice president  AK 47  Assailant  

Other Articles