Punjab national bank in haryana robbed

punjab national bank, haryana punjab national bank, punjab national bank robbed, haryana punjab national bank robbed, theifs, bollywood movies, bollywood action movies, dhoom movies, dhoom series movies, haryana police investigation

punjab national bank in haryana robbed which is major one in india till now according to the police investigation

అచ్చు సినిమాటిక్ తరహాలో హర్యానాలో బ్యాంకు దోపిడీ!

Posted: 10/28/2014 06:33 PM IST
Punjab national bank in haryana robbed

ఈమధ్యకాలంలోని దొంగలు సినిమాలను ఆదర్శంగా తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా తాజాగా హర్యానాలో జరిగిన బ్యాంకు దోపిడీనే తీసుకోవచ్చు. ఏవిధంగా అయితే సినిమాలో దుండగులు పక్కా ప్లానింగ్ తో బ్యాంకులను దోపిడీ చేస్తారో.. అలాగే హర్యానాలోని కొంతమంది దోపిడిదొంగల ఓ జాతీయ బ్యాంకును దోచేసుకున్నారు. ఈ దోపిడి విధానాన్ని పరిశీలించిన అక్కడి అధికారులు.. ఔరా అంటూ ఒక్కసారిగా నోరుతెరుచుకుని నిర్ఘాంతపోయారట! ఎవరో దుండగులు సినిమాలో వుండేవిధంగానే పక్కా ప్లానింగ్ వేసుకుని ఆ దోపడికి పాల్పడి వుంటారని అధికారులు భావిస్తున్నారు.

హర్యానాలోని గోహానా టౌన్ లో వుండే పంజాబ్ నేషనల్ బ్యాంకును కొంతమంది దుండగులు దోచేసుకున్నారు. అచ్చం సినిమాటిక్ పద్ధతిలోనే దొంగలు ముందుగానే ప్లానింగ్ వేసుకుని.. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకును దోచేశారు. ఈ బ్యాంకును దోచుకునేందుకు దొంగలు దగ్గరిలోని ఓ పాడుపడిన భవనం నుంచి ఈ బ్యాంకు వరకు భూమిలో ఏకంగా 125 అడుగుల సొరంగాన్ని తవ్వారు. 2.5 అడుగుల వెడల్పు వున్న ఈ సొరంగం సరిగ్గా బ్యాంక్ స్ట్రాంగ్ రూం వరకు వుండటంతో ఎవరో తెలిసిన వ్యక్తే ఈ దోపిడికీ పాల్పడి వుంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. బ్యాంకు స్ట్రాంగ్ రూంలో మొత్తం 360 లాకర్లు వుండగా.. వాటిల్లో మొత్తం 90 లాకర్లను పగులకొట్టి కోట్లాది రూపాయల నగదును, నగలను దోచేసుకుపోయారు. ఈనెల (అక్టోబరు) 26వ తేదీన రాత్రి సమయంలో దోపడి జరిగివుంటుందని అధికారులు భావిస్తున్నారు. నెలరోజులుగా దొంగలు పకడ్బందీగా ప్లాన్ వేసి ఈ భారీ చోరీకి పాల్పడి వుంటారని వాళ్లు భావిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్ట్రాంగ్ రూంలో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయకపోవడం దొంగలకు కలిసొచ్చిందని ఖాకీలు తెలుపుతుననారు. ఈ తరహాలోనే 2007లో కేరళలోని మలప్పురంలోగల చెలంబ్రా బ్యాంకు దోపిడీకి గురైంది కానీ.. దానికంటే ఇదే భారీ దొంగతనమని విశ్లేషకుల అభిప్రాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles