Delhi court released a statement for husbands to not torture their wives for any reason

delhi court, delhi court statement, delhi court news, delhi court orders, husband wife relation, husband jailed for 3 years, husband tortured wife, wife tortured husband

delhi court released a statement for husbands to not torture their wives for any reason

భర్తలూ.. జాగ్రత్త! భార్య మీద చేయి వేస్తే డైరెక్ట్ జైలుకే!

Posted: 10/24/2014 09:37 PM IST
Delhi court released a statement for husbands to not torture their wives for any reason

భారతదేశంలో రానురాను మహిళలపై దురాగతాలు మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అత్యాచారాల విషయాలు కాస్త పక్కనపెడితే... పెళ్లైన మహిళలు కూడా భర్తల చేతుల్లో బలైపోతున్నారు. కట్నం విషయంలోగానీ, అనుమానాలు పెరగడంవల్లగానీ, పరస్పరం మనస్పర్థలు ఏర్పడటంవల్లగానీ భర్తలు భార్యలపై దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు శారీరకంగా మహిళలపై చిత్రహింసలు గురిచేస్తే.. మరికొందరు ఏకంగా చంపేస్తున్నారు. ఇటువంటి దారుణాలు గ్రామాల్లో కంటే పట్టణాల్లో మరీ పెచ్చుమీరిపోతున్నాయి. తన కన్నవారిని కూడా కాదనుకుని భర్తతో నడిచివచ్చే భార్యలను సురక్షితంగా చూసుకోకుండా హింసిస్తున్నారు. అందుకే.. మహిళలపై ఇటువంటి దారుణాలు జరగకూడదనే నిర్ణయంతో ఢిల్లీ కోర్టు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

కన్నవారిని వదులకుని ఎంతో నమ్మకంతో మెట్టినింట అడుగుపెట్టే భార్య మంచి చెడ్డలు, సంరక్షణ చూసుకోవలసిన బాధ్యత భర్తదే అని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. అలాకాకుండా భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తే మాత్రం వారికి జైలుశిక్షేనంటూ సుప్రీం తేల్చేసింది. ఒక వ్యక్తి తన భార్యను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నందున అతనికి నేరం ఖరారు చేస్తూ.. సుప్రీం ఇలా నిర్ణయం తీసుకుంది. అలాగే తన భార్యను హింసించిన నేరానికి నేరానికి ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది.

వివరాల్లోకి వెళ్తే... 2012లో కాలిన గాయాలతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం... ఆమె ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించేందుకు సాక్ష్యాధారాలు సరిగా లేవని తెలిపింది. అయితే తన కూతురుని అల్లుడు ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని మృతురాలి తల్లి కోర్టుకు విన్నవించింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. భార్యలను ప్రేమాభిమానాలతో చూసుకోవాల్సిన బాధ్యత భర్తలకు ఉందని వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi court  husband wife relationship  husband tortured wife  telugu news  

Other Articles