Nobel laureate malala gets us liberty medal

lala Yousufzai, Nobel laureate, US Liberty Medal, girl child education activist, pakistan

nobel laureate malala gets us liberty medal

మలాలను వరించిన మరో ప్రతిష్టాత్మక పురస్కారం

Posted: 10/22/2014 06:09 PM IST
Nobel laureate malala gets us liberty medal

ప్రపంచంలోనే అతి పిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న పాకిస్థాన్ బాలిక విద్యాహక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్జాయ్ని మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. ఈసారి అమెరికా లిబర్టీ మెడల్ ను  ఆమె సోంతం చేసుకుంది. ఈ అవార్డు కింద మలాలకు దాదాపు 61 లక్షల రూపాయల నగదు అందనుంది. కాగా ఈ మొత్తాన్ని ఆమె పాకిస్థాన్లో బాలికల చదువు కోసం విరాళంగా ఇచ్చింది.

అత్యంత ధైర్యసాహసాలు చూపించిన వాళ్లకు దక్కె లిబర్టీ మెడల్ పాకిస్థాన్ లో బాలికల హక్కుల కోసం ఉద్యమిచిన మాలాలను కోరి చేరింది. బాలికల విద్య హక్కుల కోసం పాకిస్థాన్ లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన మలాలకు ఈ పురస్కారం అందింది. చివరకు వారి బెల్లెట్లకు ఎదురోడ్డి నిలచి తన ధైరసాహాలను ప్రదర్శించిన మాలాలాకు అగ్రరాజ్యం ఈ పురస్కారాన్ని అందించింది.

అపార ధైర్యసాహసాలు ప్రదర్శించి, కనీసం ప్రాథమిక మానవహక్కులు కూడా లభించని ప్రాంతంలో ఉన్న ప్రజలకోసం గళమెత్తి పోరాడినందుకు ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు అమెరికాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ (ఎన్సీసీ) ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మలాలా బ్రిటన్లో నివసిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles