The truth behind pawan kalyan car accident when he going to meet girl sreeja

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan car accident, pawan kalyan fans, pawan kalyan srija, pawan kalayan met sreeja, pawan kalyan khammam hospital, pawan kalyan sreeja news

the truth behind pawan kalyan car accident when he going to meet girl sreeja

పవన్ కారు ప్రమాదం వెనుక అసలు విషయం ఏంటో తెలుసా?

Posted: 10/17/2014 10:14 PM IST
The truth behind pawan kalyan car accident when he going to meet girl sreeja

శుక్రవారం ఖమ్మం ఆసుపత్రిలో వున్న బాలిక శ్రీజను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ బయలుదేరినప్పుడు మధ్యలోనే ఆయన కారుకు స్వల్పప్రమాదం జరిగిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఆ కొద్దిసేపటి వరకు ఈ విషయం సంచలనంగా నిలిచిపోయింది. ప్రతిఒక్క టీవీ ఛానెల్ లోనూ పవన్ కారుకు స్వల్పప్రమాదమంటూ తెగ వార్తలు ఇచ్చేశాయి. కానీ.. అక్కడ జరిగిన వ్యవహారం మొత్తం వేరని తెలిసింది. పవన్ కారుకు స్వల్పప్రమాదం జరిగిన విషయం నిజమే అయినా... అందుకు కారణం మాత్రం వేరే వుంది.

శ్రీజను పరామర్శించేందుకు పవన్ బయలుదేరిన సందర్భంలో మార్గమధ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ఆయన కారుకు అడ్డుపడ్డారు. దీంతో వెంటనే మొదటి వాహనం బ్రేక్ వేయడంతో వెనుక వున్న కారు స్వల్పంగా ఢీకొట్టడం జరిగింది. అదే అదునుగా భావించిన అభిమానులందరూ ఒక్కసారిగా కారు చుట్టూ గుమికూడేశారు. వారిని అదుపు చేసేలోపు చాలామంది దూసుకురావడంతో వారి తాకిడికి కారు అద్డం కొద్దిగా ఊడిరావడం జరిగింది. అప్పుడు పవన్ కారు నుంచి బయటకు వచ్చి కారుపై నిలబడి అభిమానులను పలకరించారు.

ఈ విధంగా జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కు గానీ, ఇతరులకుగానీ గాయాలు కాలేదు. కానీ ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దం ఊడిపోవడంతో యాక్సిడెంట్ జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆయన వేరే కారులో హాస్పిటల్ కు వెళ్లినట్లు వచ్చిన కథనాలు కూడా అబద్ధమేనని చెబుతున్నారు. కారు అద్దం ఊడిపోయినా పవన్ ఆ కారులోనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదీ అక్కడ జరిగిన అసలు విషయం! అభిమానుల ఒక్కసారిగి గుమికూడిన కారణంగానే కాన్వాయ్ కారును పవన్ కారు ఢీకొట్టడం జరిగింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  make a wish  khammam girl sreeja  pawan car accident  telugu news  

Other Articles