Sc grants jayalalithaa bail in assets case

Jayalalithaa, AIADMK, Karnataka High Court, parappana special court, paper book, 6 weeks, bail, supreme court

SC grants Jayalalithaa bail in assets case

జయమ్మకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు, బెయిల్ మంజూరు

Posted: 10/17/2014 12:59 PM IST
Sc grants jayalalithaa bail in assets case

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జయలలితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష మీద స్టే విధించింది. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాదులు నారిమన్, సుశీల్ కుమార్, తులసి వాదనలు వినిపించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరులని పరప్పనా అగ్రహార జైలు అవరణలోని ప్రత్యేక న్యాయస్థానం అమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా, అక్కడి న్యాయమూర్తి తిరస్కరించారు. దాంతో చివరి ప్రయత్నంగా జయలలిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్లతో కూడిన ధర్మాసనం జయకు బెయిల్ ఇచ్చింది. ఆరువారాల్లో కర్ణాటక హైకోర్టుకు పేపర్బుక్తో అప్పీలు చేసుకోవాలని ధర్ొమాసనం తెలిపింది.

ఎట్టకేలకు అమ్మకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మినిగిపోయారు. జైలుకెళ్లిన 21 రోజుల తర్వాత జయలలిత కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. అన్నా డీఎంకే వ్యవస్థాపక దినోత్సవం రోజునే ఆమెకు బెయిల్ రావడం శుభసూచకంగా పార్టీ నేతలు భావిస్తున్నారు..

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని బిజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. జయలలితకు బెయిల్ మంజూరైన తర్వాత సుప్రీంకోర్టు వద్ద సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడారు. ఇది సాధారణ బెయిల్ అందుకే తాను కూడా అభ్యంతరం చెప్పలేదు అని వివరించారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles