Kbc 8 gets its first female crorepati winner

kaun banega crorepathi, kbc8, amitabh bachchan, megha patil, cancer patient, 7 crores prize

KBC 8 gets its first female crorepati winner!, who is a cancer patient

క్యాన్సర్ పేషంట్ ఇంట వెలుగులు నింపిన కేబీసీ..!

Posted: 10/15/2014 04:23 PM IST
Kbc 8 gets its first female crorepati winner

బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా మహా కరోడ్పతి రియల్ గేమ్ షో.. ఓ క్యాన్సర్ ఫేషంట్ ఇంట వెలుగుల్ని నింపింది. మరి కొన్ని నెలల్లో మృత్యవు తనను కబళిస్తుందని తెలిసినా.. ఆమె ముఖంలో చిరునవ్వు ఏ మాత్రం చెదరలేదు. తాను సరే, తన పిల్లల మాటేమిటి అనుకుందో ఏమో..? గుండెల నిండా ధైర్యంతో, మొక్కవోని మనోధైర్యంతో కౌన్ బనేగా కోర్ పతి గేమ్ షోలో పాల్గొంది. కోటీశ్వరురాలైంది. తాను కష్టించి సంపాదించిన సొమ్మను తన కోసం కాకుండా, తనవారి కోసం బాగోగుల కోసమని ప్రకటించింది.

ఇప్పటికే టీవీ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతూ.. కొత్త చరిత్రను సృష్టిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ సీజన్లో ఇప్పటికే ఇద్దరు సోదరులు కలిసి 7 కోట్ల రూపాయలు గెలుచుకోగా, తొలిసారి ఓ మహిళ.. ఈ అత్యంత భారీ ప్రైజ్మనీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కేబీసీలో మహిళలు ఇంత పెద్ద మొత్తాలు గెలుచుకోవడం ఇదే ప్రథమం

cancer-patient-2

ముంబయిలోని వాసాయ్ ప్రాంతానికి చెందిన మేఘా పాటిల్ ఓ సాధారణ గృహిణి. ఆమె ఇంట్లోనే ట్యూషన్లు చెప్పుకొంటూ ఉంటారు. కేజీసీ 8వ సీజన్ లో ఈమెను అదృఫ్టం వరించింది. హాట్ సీట్ మీదకు వచ్చింది. అంతేకాదు చకచకా అమితాబ్ అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పారు. అంతే ఏడు కోట్ల రూపాయలను గెలుచుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ప్రకటించగానే.. అమె రెండు చేతులు పైకి ఎత్తి.. విన్నర్ అన్నట్టుగా తన ఆనందాన్ని ప్రదర్శించారు.  7 కోట్ల రూపాయల బహుమతి సొంతం చేసుకున్నారు.

cancer-patient-3

తనన మరణం శాసిస్తుందని, మరి కొన్నినెలల్లో తాను గతమవుతానని తెలిసినా.. పట్టుదలతో కేబీసీకి వచ్చి, ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ కూడా దాటి హాట్ సీటు వరకు వచ్చి, అక్కడ కూడా మొత్తం 14 ప్రశ్నలకూ సరైన సమాధానాలు ఇచ్చి ఏడు కోట్ల రూపాయలను తన సొంతం చేసుకున్నారు మేఘా పాటిల్. తన తరువాత తన వారసులు కష్టాలను అనుభవించకూడదన్న ఒకే కారణంతో అమె అంతలా కష్టపడ్డారు.. ఇంత చేసిన మాతృమూర్తికి.. అమ్మా నీకు వందనాలు అని చెప్పకనే చెప్పాలనిపిస్తుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaun banega crorepathi  kbc8  amitabh bachchan  megha patil  cancer patient  7 crores prize  

Other Articles