Software engineer bhavya sri missing mystery revealed

software engineer bhavya sri, bhavya sri missing mystery, bhavya sri news, bhavya sri police investigation, hyderabad software companies, bhavya sri latest news, bhavya sri mobile signals

software engineer bhavya sri missing mystery revealed according to the mobile signals

సాఫ్ట్ వేర్ భవ్యశ్రీ ‘‘అద్యశ్యం’’... మిస్టరీ వీడింది!

Posted: 10/10/2014 08:24 PM IST
Software engineer bhavya sri missing mystery revealed

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ గురువారంనాడు అదృశ్యమైన సంగతి పెద్ద దుమారమే లేపింది. గురువారం ఉదయం షేరింగ్ ఆటోలో తాను పనిచేసే కంపెనీకి భవ్యశ్రీ వెల్లిందని.. అయితే అప్పటినుంచి ఆమె గురించి తెలియరాలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ క్యాబ్ మిస్ కావడంతోనే భవ్య ఆటోలో వెళ్లాల్సి వచ్చిందని వాళ్లు వివరాలు ఇచ్చారు. దీంతో ఆఫీస్ యాజమాన్యాన్ని భవ్యశ్రీ గురించి ప్రశ్నంచగా.. ఆమె అసలు ఆఫీసుకే రాలేదని తెలిపింది. దీంతో ఈ కేసు ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఆమె ఆచూకీని ఎట్టిపరిస్థితుల్లో కనుగొనాలనే నేపథ్యంలో పోలీసులు ఐదు బృందాలుగా గాలింపు చర్యలను వేగవంతం చేసేశారు. ఈ గాలింపు చర్యల నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. భవ్యశ్రీ క్షేమంగానే వుందని... ఆమె అన్నవరం, వైజాగ్ దగ్గర్లో వుండవచ్చుననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

మొబైల్ సిగ్నల్ ఆధారంగా భవ్యశ్రీ ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులకు తెలిసింది. అలాగే ఆమె మొబైల్ సిగ్నల్స్ తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు కనుగొన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. దీంతో భవ్యశ్రీ అన్నవరం, వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో క్షేమంగానే వుందని పోలీసుల సమాచారం! అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. తమ బిడ్డ క్షేమంగానే వుందంటూ పోలీసులు భవ్యశ్రీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఆమె ఎక్కడుందోననే విషయాన్ని కనుగొని, ఆమె దొరికిన వెంటనే అధికారికంగా సమాచారం వెల్లడిస్తామని పోలీసులు తెలుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles