John o keefe may britt and edvard moser win nobel prize in medicine

nobel prize, medicine nobel, three get nobel, wife and husband

john o keefe may britt and edvard moser win nobel prize in medicine

వైద్యరంగంలో ఆలుమగలను వరించిన ‘నోబుల్’

Posted: 10/06/2014 05:11 PM IST
John o keefe may britt and edvard moser win nobel prize in medicine

వైద్యరంగంలో నోబుల్ బహుమతి విజేతలను ప్రకటించారు. మెదడులో స్వతహాగా ఉండే 'జీపీఎస్' వ్యవస్థను కనుగొన్న ముగ్గురికి 2014 సంవత్సరానికి గాను వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. జాన్ ఓ కీఫె, మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ మోజర్ ఈ బహుమతిని పొందారు. వీరిలో మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ మోజర్ ఇద్దరు భార్యాభర్తలు. నోబెల్ బహుమతి పొందిన ఐదవ జంటగా వీరు చరిత్రకెక్కనున్నారు. మరోవైపు నోబుల్ బహుమతి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని గెలుచుకున్న 11వ మహిళగా మే బ్రిట్ మోజర్ నిలిచారు.

యూనివర్సిటీ కాలేజి లండన్లోని సైన్స్బరీ వెల్కమ్ సెంటర్లో న్యూరల్ సర్క్యూట్స్ అండ్ బిహేవియర్ సంస్థకు జాన్ ఓ కీఫె డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 1939లో పుట్టిన ఆయనకు అమెరికా, బ్రిటన్ రెండు దేశాల పౌరసత్వం ఉంది. మే బ్రిట్ మోజర్ నార్వే పౌరురాలు. ఆమె యూసీఎల్లో గతంలో పనిచేసినా, ప్రస్తుతం ట్రాన్డీమ్లోని సెంటర్ ఫర్ న్యూరల్ కంప్యూటేషన్ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.

ఎడ్వర్డ్ మోజర్ కూడా నార్వే దేశస్థుడే. ఆయన తొలుత తన భార్యతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో పోస్ట్డాక్గా చేశారు. తర్వాత లండన్లోని జాన్ ఓ కీఫె ల్యాబ్లో విజిటింగ్ శాస్త్రవేత్తగా ఉన్నారు. 1996లో వారిద్దరూ నార్వే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మారిపోయారు. అక్కడే 1998 నుంచి ఎడ్వర్డ్ మోజర్ ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ట్రాన్డీమ్లోని కావ్లి ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ న్యూరోసైన్స్లో డైరెక్టర్గా ఉన్నారు.

కాగా, బహుమతి మొత్తంలో సగం జాన్ ఓ కీఫెకు వెళ్తుంది. మిగిలిన మొత్తాన్ని భార్యాభర్తలు మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ మోజర్ ఇద్దరు పంచుకోవాల్సి ఉంటుందని నోబుల్ బహుమతుల వర్గాలు తెలిపాయి. తమ దంపతులిద్దరికీ కలసి నోబుల్ బహుమతి రావడం సంతోషంగా వుందని, అందులోనూ 11 వ మహిళగా నిలివడం ఇంకా సంతోషకరంగా వుందని మే బ్రిడ్ మోసర్ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nobel prize  medicine nobel  three get nobel  wife and husband  

Other Articles