Mp kottapalli geetha complaint to speaker on ysr congress party

mp kottapalli geetha, kottapalli geetha news, kottapalli geetha ysr congress party, kottapalli geetha speaker, ysr congress party leaders, ysr congress party women leaders

mp kottapalli geetha complaint to speaker on ysr congress party

వైకాపాలో మహిళలపై పెచ్చుమీరుతున్న వేధింపులు..

Posted: 09/24/2014 09:16 PM IST
Mp kottapalli geetha complaint to speaker on ysr congress party

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్న మహిళలను సరిగ్గా గౌరవించడం లేదని.. వారి పదవికి తగ్గట్టు మర్యాద ఇవ్వడం లేదని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే! ఈ మేరకు కొంతమంది మహిళా కార్యకర్తలతోపాటు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా కొత్తపల్లి గీత అయితే వైకాపా పార్టీ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనపై అసభ్యకరంగా ఫేస్ బుక్ లో మెసేజ్ లు వస్తున్నాయని పేర్కొన్న నేపథ్యంలో వైకాపా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. పైగా మహిళలకు ఆ పార్టీలో ఏమాత్రం గౌరవమర్యాదలు దక్కడం లేదని విమర్శించిన విషయం విదితమే! ఇప్పుడు తాజాగా ఆమె ఈ వేధింపులపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కొత్తపల్లి గీత విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు ఎవరైనా ఎమ్మెల్యే చేసినవా లేక పార్టీయే ఇలా చేయించిందా..? అనేది స్పష్టం చేయాలని పేర్కొన్నారు. మహిళా ఎంపీ అనే చులకనభావంతో తనని చూస్తున్నారని... తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని... ఎవరి ఆస్తులు తాను కాజేయలేదని తెలిపారు. తాను ఇంతవరకూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన నేపథ్యంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం లేక ఇలాంటి చిల్లర రాజకీయాలకు వైకాపా పాల్పడుతోందని ఆరోపించారు. తాను ఒక ఎంపీ అయినప్పటికీ తనపై సామాజిక వెబ్ సైట్లలో వచ్చిన అసభ్యకర వ్యాఖ్యల మీద వైకాపా ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు.

అటు ఆ పార్టీకి చెందిన ఇతర మహిళా కార్యకర్తలు కూడా వైకాపా పార్టీ మీద నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు మహిళలకు ఎంతో గౌరవం లభించేదని.. కానీ నేడు అలా జరగడం లేదని వాపోతున్నారు. పార్టీలో జరిగే మార్పుల విషయాలుగానీ.. తీసుకునే కీలక నిర్ణయాల గురించి తమకు వైకాపా విశ్లేషించడం లేదని.. మహిళలకు పార్టీకి చెందిన కార్యకలాపాల గురించి ఏమాత్రం చెప్పడం లేదని చెబుతున్నారు. అలాగే తమను పార్టీలో చాలా చులకన భావంతో చూస్తున్నారని వాపోతున్నారు. మరి ఈ విషయంపై వైకాపా ఎలా స్పందించనుందో వేచి చూడాలి. మరోవైపు కొత్తపల్లి ఫిర్యాదు మేరకు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారో..?నంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles