Balka suman says revanth reddy is begger

balka suman, balka suman attack, balka suman wiki, balka suman family, balka suman marriage, balka suman latest news, trs, revanth reddy, revanth reddy on trs, telangana, revanth reddy on kcr, revanth redddy family, revanth reddy daughter, metro rail

telangana state's young mp balka suman fires on tdp mla revanth reddy for accusing kcr on l and t issue : balka suman says revanth reddy is pet dog of chandrababu naidu he is a begger of tdp party

బాబు బిచ్చగాడు బాగా అరుస్తున్నాడు - బాల్క

Posted: 09/23/2014 12:12 PM IST
Balka suman says revanth reddy is begger

ఎవరిని ఏ రేంజ్ లో తిట్టాలన్నా.. అది ఉద్యమపార్టీ నేతలకే సాధ్యం. బచ్చాగాడు అనాలన్నా.. బిచ్చగాడు అని విమర్శించాలన్నా గుర్తుకు వచ్చేది వారే. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అన్న  మాటలు ఇవే గుర్తకు తెస్తున్నాయి. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఎంపి సుమన్.., రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు పెంచుతున్న కుక్క అని ద్వజమెత్తారు. బాబు విశ్వాసం పొందటం కోసం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై అర్ధ రహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ మీడియా సమావేశంలో రేవంత్ పై సుమన్ తట్టుకోలేని విధంగా విమర్శలు చేశారు. పగలు ప్రెస్ మీట్ పెట్టడం, సాయంత్రం చంద్రబాబు ఇంటికెళ్ళి జోలె పట్టడం రేవంత్ నైజమని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా స్వల్పకాలంలో రేవంత్ కు కోట్ల రూపాయల డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. 1999లో హైదారబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి,  ప్రస్తుతం కోటీశ్వరుడు ఎలా అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ లో బిల్డింగ్, స్థలం ఎవరు ఇచ్చారో బయటకు చెప్పమంటావా.. ? అని హెచ్చరించారు.

హక్కులతో బెదిరింపులు

సమాచారహక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను రేవంత్ బెదిరించి కోట్లు కూడబెట్టారని విమర్శించారు. అదేవిధంగా ఆర్టీఐతో పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఆ పప్పులు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉడకవు అని స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు చేసినా.., ఎంత బ్లాక్ మెయిల్ చేసినా.., ప్రభుత్వం తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రెడ్డి బచ్చాగాడు అని నాయిని విమర్శిస్తే.., అదే పార్టికి చెందిన ఈ నేత బిచ్చగాడు అని మండిపడ్డారు. మరి దీనిపై టీడీపీ ఫైరింగ్ స్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balka suman  revanth reddy  latest news  telangana  

Other Articles