Bollywood baadshah shah rukh khan creates another sensation in twitter

bollywood latest news, bollywood baadshah shah rukh khan, shah rukh khan latest news, shah rukh khan twitter, shah rukh khan twitter followers, bollywood big b amitabh bachchan, hero salman khan, hero aamir khan

bollywood baadshah shah rukh khan creates another sensation in twitter

ట్విటర్ లో షారుఖ్ ఖాన్ సంచలనం!

Posted: 09/20/2014 07:10 PM IST
Bollywood baadshah shah rukh khan creates another sensation in twitter

(Image source from: bollywood baadshah shah rukh khan creates another sensation in twitter)

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏం చేసినా అది సంచలనంగా నిలిచిపోతుందని అందరికీ తెలిసిందే! సినిమాలు, వ్యక్తిగత, ఇతర వ్యవహారాల్లో సంబంధించి షారుఖ్ ఖాన్ అందరి హీరోలను దాటేసి ఎప్పటికీ ముందుంటాడు. ఇప్పుడు తాజాగా ట్విటర్ లో మరో సంచలనాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ట్విటర్ లో ఆయన అభిమానుల సంఖ్య ఏకంగా 9 మిలియన్లు దాటింది. దీంతో షారుఖ్ ట్విటర్ లో అత్యధిక మంది అభిమానులను మూటగట్టుకున్న రెండో భారతీయ నటుడిగా మరో రికార్డును తన ఖాతాలో నమోదు చేయించుకున్నాడు.

ఇదిలావుండగా.. ట్విటర్ ఫాలోవర్ల విషయంలో బాలీవుడ్ బిగ్ బీ 10.4 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటీ స్థానంలో వుంటే.. కేవలం నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2010 జనవరిలో షారుఖ్ ట్విటర్ ఖాతాను ఓపెన్ చేయగా.. ఇప్పటివరకు 7,718 ట్వీట్లు చేయడంతోపాటు 9 మిలియన్ ఫాలోవర్స్ ను తన వెంటపెట్టుకుని రెండో స్థానంలో వుండటంతో విశేషం! ఇక హీరో సల్మాన్ ఖాన్ 8.26 మిలియన్లు, ఆమీర్ ఖాన్ 8.6 మిలియన్ల ఫాలోవర్లతో బాద్షా కంటే కాస్త వెనకుండి పోయారు. అభిమానులు తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు షారుఖ్ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ తన తాజా చిత్రం ‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ ప్రమోషన్ లో పనుల్లో ఫుల్ బిజీగా వున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shah rukh khan  salman khan  amitabh bachchan  aamir khan  twitter  

Other Articles