Sania mirza praizes modi m gif

sania mirza, sania mirza hot, sania mirza latest photos, sania mirza marriage, sania photos, tennis matches, tennis stars, latest news, sports news, modi, narendra modi, prime minister of india, latest news, central government, nda, bjp, delhi

modi had a great mind power he hes excellent remembering knowledge says sania mirza : tennis star sania mirza praises pm modi for remembering her sister name after she met him a long ago

మోడి మెదడు చూసి సానియా షాక్

Posted: 09/14/2014 10:17 AM IST
Sania mirza praizes modi m gif

ప్రధాని నరేంద్రమోడి మెదడు చూసి సానియా మిర్జా షాక్ అయ్యింది. మెదడు అంటే నేరుగా మెదడని కాదు.., అందులోని జ్ఞాపక శక్తన్నమాట. ప్రధానికి ఉన్న ఈ పవర్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని హైదరాబాదీ తెలిపింది. యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ గెలిచిన సానియా.., ప్రధాని మోడిని కలిసింది. ప్రత్యేక ఆహ్వానం అందటంతో పొంగిపోయిన టెన్నిస్ తార ఈ కలయిక తనకు గొప్ప అనుభూతి ఇచ్చిందని తెలిపింది.

ఇక మోడి తెలివి, జ్ఞాపక శక్తి గురించి మాట్లాడుతూ.., మోడి గుజరాత్ ప్రధానిగా ఉన్న సమయంలో చాలా ఏళ్ళ క్రితం అహ్మదాబాద్ లో జరిగిన  షూటింగ్ పోటిల్లో తన చెల్లి ఆనమ్  పాల్గొందని.., అప్పుడు నరేంద్రుడిని తన చెల్లి కలిసిందని తెలిపింది. తాజాగా తాను  ప్రధానిని కలిసిన సందర్బంగా ఆనమ్ ఎలా ఉందని అడగటంతో ఆశ్చర్యపోయానని చెప్పింది. ప్రధాని తన చెల్లి గురించి గుర్తుంచుకుని మరి తనను అడగటం అనేది తనకు గొప్ప అనుభూతికి కల్గించిందని.., తమను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు కూడా తెలిపింది.

ప్రధానికి ఉన్న బిజీ షెడ్యూల్ లో కూడా తనను కలిసి.., మాట్లాడటం పట్ల సానియా సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రధాని మాట్లాడిన తీరు చాలా బాగుందని కితాబిచ్చింది. టైటిల్  గెలిచినందుకు అభినందించటంతో పాటు తన అకాడమి గురించి వాకబు చేశారని.. భవిష్యత్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారని ఉప్పొంగిపోతూ చెప్పి జపాన్ వెళ్లింది. అమెరికాలో జరిగిన యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్ సానియా గెలిచింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రూ. కోటి ప్రోత్సాహకం ప్రకటించింది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  narendra modi  tennis  latest news  

Other Articles