Ys jagan mohan reddy gave leadership responsibilities to butta renuka

ys jagan mohan reddy, ys jagan latest news, ys jagan mohan reddy butta renuka, butta renuka news, butta renuka news, kurnool mp butta renuka, tdp party news

ys jagan mohan reddy gave leadership responsibilities to butta renuka

వైకాపా ట్రీట్ మెంట్ లో జగన్.. ‘‘బుట్ట’’తో టీడీపీకి షాక్!

Posted: 09/06/2014 12:35 PM IST
Ys jagan mohan reddy gave leadership responsibilities to butta renuka

(Image source from: ys jagan mohan reddy gave leadership responsibilities to butta renuka)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో తీవ్రంగా మునిగిపోయినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం వైకాపా నుంచి నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఖాళీ అయిపోతూ వస్తోంది. అలాగే మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదు ఆ పార్టీలో వున్న మహిళా నాయకుడు జగన్ పై వ్యతిరేకంగా విమర్శలూ చేశారు. దాంతో ప్రస్తుతం పార్టీలో వున్న సభ్యులు కూడా ఎక్కడ వీడిపోతారోనన్న పునరాలోచన చేసుకున్న జగన్.. తాను ముందుకు చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో పూర్తిగా మునిగిపోయినట్లు వున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తన పార్టీ పాలకమండళ్లను పునర్వ్యవస్థీకరించే పనిలో చాలా బిజీగా వున్నాడని సమాచారం!

అందులో భాగంగానే జగన్ తన పార్టీ నేతలకు నాయకత్వ బాధ్యతలను అప్పగించే పనిలో మునిగిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వారికి ఒకరకంగానూ.. ఓడిపోయినవారికి మరో రకమైన బాధ్యతలను అప్పగించి.. తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో వున్నట్టు తెలుస్తోంది. అందుకు తన పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులను, ప్రధానకార్యదర్శులను, రాజకీయ కార్యదర్శులను జగన్ నియమించుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన పేర్లు బయటికి వచ్చాయి. తన పార్టీని వదలేసి దూరంగా వెళ్లిపోతారనుకున్న నాయకులకు జగన పార్టీ బాధ్యతలను అప్పగించడం విశేషంగా మారిపోయింది. సదరు నాయకుల పేర్లను విన్న టీడీపీ పార్టీ కూడా షాక్ కు గురయ్యింది. అందుకు ఉదాహరణగా ‘‘బుట్టా రేణుక’’ను తీసుకోవచ్చు.

కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక.. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును కలిసింది. దీంతో ఆమె వైకాపాను వీడుతుందనే అభిప్రాయాలు జోరుగా వినిపించాయి. కానీ అంతోనే ఏమయిందో తెలీదు కానీ.. బుట్టా రేణుక, జగన్ కు వెళ్లి రాఖీ కట్టింది. దీంతో తమ పార్టీలోకి చేరుతుందని భావించిన టీడీపీకి షాక్ తగిలింది. ఆ తర్వాత బుట్టా తిరిగి టీడీపీ పార్టీవైపు చూడలేదు. వైకాపాలోనే కొనసాగుతూ.. ఆ పార్టీ బలోపేతం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమంటూ తెలిపింది. దీంతో జగన్ ఈమెపై పూర్తి విశ్వాసంతో ఇప్పుడు తాజాగా పాలకమండలిలో స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. పార్టీలో పనిచేస్తున్న అనేమంది నేతలతోపాటు బుట్టా రేణుకకు కూడా నాయకత్వ బాధ్యతలను అప్పగించి జగన్ మరోసారి వార్తల్లోకెక్కేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : butta renuka  ys jagan mohan reddy  tdp party  ysr congress party  

Other Articles