Yanamala comments on jagan

yanamala ramakrishnudu, ap government, ap cabinet chandrababu naidu, latest news, telangana, latest news, ap assembly, telangana assembly, tdp, jagan, ysr congress, lotus pond, idupula paya, ys rajashekar reddy

yanamala criticised jagan by sayin assembly means not lotus pond or idupula paaya : in assembly only democrasy not jaganokrasi says yanamala

డెమోక్రసి-జగనోక్రసి దుమారం

Posted: 09/04/2014 09:57 AM IST
Yanamala comments on jagan

తిట్టుకోవటం కోసం కొత్త పదాలు కనిపెట్టాలంటే అది మన రాజకీయ నేతల వల్లే అవుతుంది. అందుకు అసెంబ్లీ అయితే వారికి సరైన వేదిక. ఒకరిపై మరొకరు తిట్టుకోవటానికి.. మాటల యుద్ధానికి.., చివరికి ఒక దశలోని ముష్టియుద్ధానికి కూడా అసెంబ్లీయే వేదికవుతుంది. తాజాగా ఏపీ ఆర్ధికమంత్రి యనమల అసెంబ్లీలో యనమల అన్న మాటలు కొద్దిసేపు గందరగోళానికి దారితీశాయి. శాసనసభలో డెమోక్రసి మాత్రమే ఉంటుంది.., జగనోక్రసి ఉండదని యనమల అన్నారు. ప్రతిపక్ష నేత అయినా., అధికార పక్ష నేత అయినా సభ నియమాలు, నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. శాసనసభకూ కొన్ని నిబంధనలు ఉంటాయనీ.., వాటి ప్రకారమే సభ జరుగుతుందని సభా వ్యవహారాల మంత్రి హోదాలో స్పష్టం చేశారు.

అసెంబ్లి అంటే లోటస్ పాండ్ కాదు


కేవలం రాజకీయం కోసమే ప్రకటనకు ముందు చర్చ అంటూ వైసీపీ రాద్దాంతం చేస్తోందని యనమల విమర్శించారు. జగన్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటానికి అసెంబ్లీ లోటస్ పాండ్, ఇడుపుల పాయ కాదన్నారు. రాజధానిపై మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత వైసీపి తమ అభ్యంతరాలు, డిమాండ్లు తెలియజేయవచ్చన్నారు. రాజధాని ఎక్కడ అనే విషయం ప్రకటించకుండా ఎలా చర్చ చేపడుతారు అని ప్రశ్నించారు.

ఇక జగనోక్రసి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను అవమానించే విధంగా మంత్రి మాట్లాడారని ద్వజమెత్తారు. సభలో ఈ తరహా మాటలు సరికాదని ఎమ్మెల్యే నెహ్రూ హితవు పలికారు. తమ అధినేతకు అధికార పక్షం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో ఎన్నికైన సభ్యులం తప్ప.., దొడ్డిదారిలో మంత్రి పదవులు పొందలేదని నేరుగా యనమలను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో టిడిపి సభ్యులు కూడా నిరసన తెలిపారు. రెండు పార్టీల నిరసనలతో గందరగోళం నెలకొనటంతో సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yanamala  democracy  jagan  latest news  

Other Articles