Cpi state secretary chada venkat reddy warning to telangana government

cpi state secretary chada venkat reddy, chada venkat reddy, cm kcr, telangana government, minister harish rao, bjp party, medak mp elections

cpi state secretary chada venkat reddy warning to telangana government : cpi state secretary warning to telangana government to do favour telangana people in all segments

‘‘టీ-ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి!’’

Posted: 08/29/2014 06:34 PM IST
Cpi state secretary chada venkat reddy warning to telangana government

(Image source from: cpi state secretary chada venkat reddy warning to telangana government)

విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ సమస్యలు అమాంతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే! ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో రైతు రుణమాఫీల సమస్య మరింతగా పెరిగిపోయింది. ఇక తెలంగాణాలో కరెంట్ సమస్య అయితే మరీ దారుణంగా వుంది. పట్టణాల్లో 6 గంటలకుపైగా విద్యుత్ పోతుంటే.. గ్రామాల్లో అయితే అంతకంటే ఎక్కువ సమయమే విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుతోంది. కనీసం 3 గంటలవరకు విద్యుత్ కూడా తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కూడా! ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు నిరసనలు చేశారు. తమకు 7 గంటల వరకు విద్యుత్ ఫ్రీగా కేటాయించాల్సిందేనంటూ వాళ్లు కోరుకుంటున్నారు. అయితే ఇదే అవకాశమని భావించిన ప్రత్యర్థ నాయకులు.. తెలంగాణ ప్రభుత్వంపై లెక్కలేనన్ని విమర్శలు కురిపిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం విఫలం అయిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటుగా కామెంట్లు చేశారు. మెదక్ పర్యటనలో భాగంగా అక్కడికి విచ్చేసిన ఆయన.. తెలంగాణ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరంతర విద్యుత్ కోతలతో అటు రైతులను, ఇటు ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ఆయన హితువు పలికారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ.. మండలానికో నియోజకవర్గానికి ఒకరికిచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. అలాకాకుండా హరిజనులు, గిరిజనులకు మూడెకరాల భూమిని ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా కానిపక్షంలో.. వామపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాటం చేస్తామని చాడ వెంకట్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి హరీష్ రావు వామపక్ష పార్టీల నేతలైన చాడ, తమ్మినేనిలను కలిసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా శుక్రవారం ఉదయం కలిసి చెప్పారు. అయితే చాడ చేస్తున్న ఆరోపణలను చూస్తుంటే ఆయన టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా కనిపించడం లేదు. ఇదిలావుండగా.. మెదక్ ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని కుండబద్ధలు కొట్టారు. మరి ఆయన ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తారన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles