100 days of the narendra modi government

narendra modi, 100 days narendra modi government, narendra modi government latest news, narendra modi news, narendra modi minsters, narendra modi meeting, nda government, narendra modi comments manmohan singh, manmohan singh government, sonia gandhi

100 days of the Narendra Modi government: Quick decision making, e-governance in focus

కేవలం 100 రోజుల్లో రాజకీయ చరిత్రనే తిరగరాసిన మోడీ!

Posted: 08/26/2014 06:15 PM IST
100 days of the narendra modi government

భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా కేవలం 100 రోజుల్లో ప్రధాని నరేంద్రమోడీ సరికొత్త సంచనాలనాన్నే సృష్టించాడు. గత ప్రభుత్వాల విధానాలను పూర్తిగా మార్చేసి.. అసలుసిసలైన సరికొత్త రాజకీయ విధానానికి నాంది పలికిన మొట్టమొదటి ప్రధానిగా 100 రోజుల్లోనే నిరూపించేసుకున్నాడు ఈ చాయ్ వాలా! మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాన్ని పూర్తిగా తుడిచిపారేసి దిశగా అడుగులు వేసిన మోడీ... తానేంటో చివరికి నిరూపించేసుకున్నాడు. ఏదైనా కార్యకలాపాలు, విధివిధానాలను, కార్యక్రమాలు, పథకాలు, ఆదేశాలు వంటివి జారీ చేయడంలో తక్షణమే నిర్ణయం తీసుకోవడంలో మోడీయే అందరూ ప్రధానమంత్రుల కంటే ముందున్నాడు. సోమవారంనాడు మోడీ ప్రధానిగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయన మీద ఒక చిన్న స్పెషల్ రిపోర్ట్!

గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 62మంది మంత్రులతో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ అండ్ ఎక్స్ ట్రా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనే బృందాలు కేంద్ర నిర్ణయాలను చూసుకోవడానికి వుండేవారు. కానీ ఈసారి ఎన్టీయే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోడీ అటువంటి విధానాన్ని పూర్తిగా తొలగించేశారు. ఈసారి నిర్ణయాలను, సమస్యలను, ఇతరత్ర లీగల్ కేసుల వ్యవహారంలో నేరుగా ప్రధానికే సంప్రదించే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ప్రధాని అందుబాటులో లేకపోతే.. నేషనల్ డాటా లిటిగేషన్ గ్రిడ్ ను ఏర్పాటు చేయించాడు. తమకొచ్చిన ఫిర్యాదుల అనంతరం అవి లీగల్ కేసులకు సంబంధించినవా..? లేక అక్రమాలకు సంబంధించినవా..? అనే అంశాల మీద నిర్ణయం తీసుకున్న తర్వాత వెనువెంటనే వారు ప్రధానీకి సమాచారాన్ని అందిస్తారు. దానిని పరిశీలించిన అనంతరం ప్రధానీ తన తుదినిర్ణయాన్ని ప్రకటించి దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనివెనుక పెద్ద ప్రాసెస్ గానీ, ఎక్కువ సమయంగానీ తీసుకోవడం జరగదు... ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ముగించాలనే ప్రణాళికతోనే ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. ఇకనుంచి మంత్రులు, బ్యూరోక్రాట్లు సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా మొదట ప్రధాని దగ్గర అందుకు సంబంధించి ఆమోదముద్రను తీసుకోవాల్సి వుంటుంది. అది ఎంతటి పెద్ద సమస్యైనా.. ఎంతటి చిన్న సమస్యైనా ప్రధాని తీసుకున్న నిర్ణయంపైనే మంత్రులు ఆచరించాల్సి వుంటుంది.

ఆహార పదార్థాల విషయంలోనూ మోడీ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. సంవత్సరానికి ఒకసారి భారీగా ఆహారపధార్థాల ధరలు చుక్కలకంటుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి విధానాన్ని అవలంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ధరల పెరుగుదలను నియంత్రించడం కోసం నేషనల్ ఫుడ్ గ్రిడ్ అనే ఒక విధానాన్ని అమలు చేశారు. అయితే గత యూపీఏ హయాంలో ఇటువంటి విధానం వుండేది కాదు. తద్వారా అప్పుడు ధరలు గణనీయంగా పెరిగిపోవడమే కాకుండా అక్రమాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

భూసేకరణ బిల్లుతో ఇంకొక మంచి విధానాన్ని మోడీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ప్రాజెక్టులు నిర్మించుకోవడం కోసం ఎవరైతే భూములను సేకరించి వుంటారో వారికి ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాల విషయాలను ఒకేసారి అమలు జరిగేలా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా భూములను కొన్న అనంతరం దాని రిజిస్ట్రేషన్ కోసం, ఇంకా ఇతరత్రా పనులకోసం నానా రాద్ధాంతం సృష్టిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం అలాకాకుండా అతి తక్కువ సమయంలో భూమికి సంబంధించిన వివరాలను కొనుగోలుదార్లకు ప్రభుత్వ ఆమోదముద్ర వేసిన అనంతరం అప్పగించడం జరుగుతుంది. అది కూడా అతి తక్కువ కాలంలోనే అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేసింది.

ఇలా ఈ విధంగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టిన తన 100 రోజుల్లోనే సరికొత్త విధానాలను అమలు చేసి కొత్త రాజకీయానికి నాంది పలికారు. ఇవి ఇంకా బయటికి రాకపోయినా.. చాలావరకు ప్రాంతాల్లో మాత్రు జరుగుతున్నాయి. మిగతా ప్రాంతాలకు అతి త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ అమలులోకి తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

గత యూపీఏ ప్రభుత్వం చేసిన ఛండాలపు నిర్ణయాలు తీసుకోకుండా.. ఈసారి అందరూ మంత్రులు, సీనియర్ సెక్రటరీలు, బ్యూరోక్రాట్లు మొత్తం కలిసి రోజువారీగా సమావేశాలు నిర్వహించి.. ఆయా సమస్యలపై తగిన నిర్ణయం తీసుకోనేలా అందరూ నేరుగా ప్రధానీని సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన దానిపై ముందుగా చర్చలు జరిపి అందరూ ఒకే తాటిపై వచ్చి నిర్ణయం తీసుకోవాలని.. గత ప్రభుత్వం లాగా మోడీ ప్రభుత్వం ప్రతిరూపంగా మారుకూడదని ప్రయత్నంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుపుతున్నారు.

అయితే మోడీ వ్యవహరిస్తున్న ఈ దూకుడు ప్రదర్శనను చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడు వణుకు వచ్చినట్టు తెలుస్తోంది. మోడీ నిర్వహిస్తున్న ఫాస్ట్ ట్రాక్ వ్యవహారంతో మంత్రలు, బ్యూరోక్రాట్లు, సీనియర్ సెక్రటరీల మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని.. తద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ నిర్వహించే ఈ 100 రోజుల ఎజెండాలో మినిస్టర్లు, బ్యూరోక్రాట్లు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమపడాల్సి వుంటుందని.. వారి మీద నిత్యం మానిటరింగ్ జరుగుతూ వుంటుందని పేర్కొంటున్నారు. ఏదిఏమైనా.. మోడీ 100 ఎజెండా మాత్రం అదిరిపోయే రేంజిలో వుందని కొంతమంది ప్రముఖులు వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  nda government  ministers  bereaucrats  upa government  

Other Articles