Veteran actor robin williams sucide

robin williams, sucide, hollywood news, oscar awards, colifornia news, actor robin williams sucide, best actors, comedians, movie news, robin sucide causes

veteran actor oscar award winner robin williams sucide dead : great actor funny man robin williams sucide in colifronia police enquiry going on

ఆస్కార్ విజేత ఆత్మహత్య

Posted: 08/12/2014 10:48 AM IST
Veteran actor robin williams sucide

మరో నట కుసుమం నేల రాలింది. ఈ జీవితాన్ని ఇక భరించలేనంటూ తనువు చాలించాడు. ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఆ నటుడి జీవితంలో మాత్రం విషాదం ఉంది. రంగస్థలపై గొప్ప నటనతో ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. అయితేనేం జీవితమనే రంగస్థలంపై మాత్రం ఎందుకో అంతే ఉత్తమంగా చివరి వరకు ఉండలేకపోయాడు. మరి తన పాత్ర ఇంతవరకే ఉందా ఏమో తెలియదు కానీ.., మేటి నుటడు రాబిన్ విలియమ్స్ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో టిబ్యరాన్ ప్రాంతంలో ఉండే రాబిన్ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలిసులు చెప్తున్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో విషయం తెలుసుకున్న పోలిసులు, విలియమ్స్ ఇంటికి వెళ్ళి చూడగా అప్పటికే ఆయన చనిపోయి ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. అయితే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పలేమంటున్నారు. ఉక్కిరిబిక్కిరయి మృతి చెందినట్లు తమకు ప్రాధమిక సమాచారం ఉందన్నారు. తీవ్రమైన మనోవేధన వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు అమెరికా పత్రికలు చెప్తున్నాయి.

మంచి స్నేహితుడ్ని కోల్పోయా : రాబిన్ భార్య

రాబిన్ విలియమ్స్ మరణ వార్త విన్న ఆయన కుటుంబం షాక్ కు గురైంది. విలియం చనిపోయినట్లు తెలియటంతో గుండె పగిలిపోయిందని ఆయన భార్య పేర్కొంది. తన భర్తను కోల్పోయాననే విషయం జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆవేదనతో తెలిపింది. రాబిన్ మంచి భర్త అని కాకుండా తనకు మంచి స్నేహితుడుగా, అన్ని అర్ధం చేసుకునే గొప్ప వ్యక్తి అని చెప్పింది. అలాంటి వ్యక్తి దూరం కావటం కుటుంబానికి తీరని లోటుగా విలియం బార్య కన్నీళ్ళ పర్యంతమైంది. అయితే రాబిన్ ఆత్మహత్యపై వివాదాలు, విచారణలకు చోటివ్వకూడదని మీడియాను ఆమె విజ్ఞప్తి చేసింది. విలియం లేకపోయినా ఆయన జ్ఞాపకాలు తమతోనే ఉన్నాయని, వాటిని అలాగే ఉండనివ్వాలని కోరింది.

రాబిన్= ఫన్నీ మ్యాన్

రాబిన్ విలియమ్స్ ఫన్నీ మ్యాన్ గా ఇంగ్లీష్ సినిమా అభిమానులకు సుపరిచితుడు. ఇండస్ర్టీలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలు పొందాడు. ఎక్కువగా కామెడి, ఎంటర్ టైన్ మెంట్ పాత్రల్లో నటించి అందర్నీ నవ్వించేవాడు. కేవలం హాస్య పాత్రలే కాదు.., సీరియస్ గా ఉండే క్యారెక్టర్లను కూడా అలవోకగా రక్తి కట్టించటంలో మేటి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 97లో వచ్చిన గుడ్ విల్ హంటింగ్ సినిమాకు ఉత్తమ సహాయ నటుడుగా అస్కార్ అవార్డు అందుకున్నాడు. కెరీర్ లో ద ఫిషర్ కింగ్ (1991), డెడ్ పోయెట్స్ సొసైటి (1989), గుడ్ మార్నింగ్ వియత్నాం (1987) సినిమాలు ఉత్తమమైనవిగా చెప్పవచ్చు. ఇంత గొప్ప నటుడికి ఏం కష్టమొచ్చిందో కాని తనువు చాలించాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిద్ధాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : robin williams  sucide  hollywood  oscar awards  

Other Articles