Governor narasimhan out in new governor in modi government

governor narasimhan out, new governor in andhrapradesh,modi government, trs party, governor narasimhan and kcr, telangana cm kcr, kcr comments on bjp, kcr vs modi,

governor narasimhan out in new governor in modi government: E S L Narasimhan, governor of ... Modi government and that it is not clear whether Narasimhan

గవర్నర్ నరసింహన్ కొంప ముంచిన గులాబీలు?

Posted: 08/10/2014 10:53 AM IST
Governor narasimhan out in new governor in modi government

ఇప్పుడు గవర్నర్ నరసింహన్ కొంప మునిగిపోతుందనే విమర్వలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం గులాబీల గుసగుస వలనే గవర్నర్ నరసింహన్ కు పదవి కష్టాలు వచ్చినట్లు రాజకీయ నేతులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు ఉద్వాసన ఖాయంలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నప్పటికీ... నరసింహన్ మాత్రం మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. నరసింహన్ వైఖరితో సమస్యలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయన్న అంచనాకు వచ్చింది.

హైదరాబాదుపై అధికారాలు గవర్నర్ కు కట్టబెట్టాలని భావిస్తున్న తరుణంలో... నరసింహన్ సరైన రీతిలో పాలించలేరని కేంద్రం యోచిస్తోందని సమాచారం. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, గవర్నర్ గా నరసింహన్ ను తొలగించి... ఆయన స్థానంలో దీటైన వ్యక్తిని నియమించాలనే భావనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.

తమ ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ గా ఉంది. పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలను కూడా టీఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుండటాన్ని విపరీత అంశంగా పరిగణిస్తోంది. హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలను కట్టబెట్టేందుకు... అవసరమైతే టీఎస్ ప్రభుత్వంపై సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రతి అంశంలోనూ కేసీఆర్ సర్కార్ దుందుడుకు వైఖరితో ముందుకు పోతూ, రాజ్యాంగేతర శక్తిలా ప్రవర్తిస్తోందని కేంద్రం తలపోస్తోంది.

టీఆర్ఎస్ నేతలు కాశ్మీర్ తో తెలంగాణను పోల్చడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, స్థానికత అంశంతో ఒక ప్రాంతం వారిని పరాయివారుగా చేసేందుకు ప్రయత్నించడం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే దృష్టి సారించారని విశ్వసనీయ సమాచారం.

ఈ నేపథ్యంలో, నరసింహన్ ను మార్చి భరద్వాజ్ లాంటి రాజకీయవేత్తను కొత్త గవర్నర్ గా నియమించే యోచనలో కేంద్రం ఉంది. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకుంటే... మరోసారి రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా కేంద్రం వెనకడుగు వేయకపోవచ్చని తెలుస్తోంది

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles