Stop conjecture and baseless rumours not taking congress post priyanka gandhi

priyanka gandhi fire on rumours, priyanka gandhi angry rumours, congress party, priyanka gandhi vs congress leaders, sonia gandhi, rahul gandhi , priyanka gandhi pm post,

Stop Conjecture and Baseless Rumours Not Taking Congress Post-Priyanka Gandhi: Priyanka Gandhi Vadra today emphatically denied what she called "conjecture" and "baseless rumours" about her taking a key post...

ఎగిరిపడిన ప్రియాంకగాంధీ?

Posted: 08/09/2014 09:51 AM IST
Stop conjecture and baseless rumours not taking congress post priyanka gandhi

ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ నేతలు చూపులు.. ప్రియాంక గాంధీ పై ఉన్నాయి. ‘‘ప్రియాంక గాంధీ ..రావాలి.!!. రాహుల్ గాంధీ వెళ్లిపోవాలని’’కాంగ్రెస్ పార్టీలో.. తలపండిన నేతలు కోరుకుంటున్నారు. కానీ అమ్మ మాత్రం .. ‘‘ప్రియాంక వద్దు! రాహుల్ గాంధీయే ముద్దు’’!! కాంగ్రెస్ నేతలకు జోలపాడుతుంది. ఈ మొద్దబ్బాయితో.. మా రాజకీయ జీవితాలు చీకటి నిండింది.

అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ ఇంటి చుట్టు.. మీడియాలో , న్యూస్ పేపర్లలో..సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో.. ఆమెకు భజన చేస్తున్న భక్తులు పెరిగిపోయారు. దీంతో ప్రియాంక గాంధీ నిద్రలేని రాత్రులు గడుపుతూ.. ఆమె భర్త వాద్రా కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు మాసాల పుకార్లు పుట్టించారు. దీంతో ‘‘ఎగిరిపడిన ప్రియాంక గాంధీ ’’ బాబోయ్ మీ పుకార్లు ఆపండి? అని మండిపడింది.

ఇక ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు.. కాంగ్రెస్‌లో ప్రధాన పదవిని స్వీకరించబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రియాంక వాధ్రా తోసిపుచ్చారు. ఆ వార్తలన్నీ ఊహాజనితమైనవని, ఆధారాలులేనివని కొట్టిపారేశారు. నేను కాంగ్రెస్‌లో ప్రధాన పదవిని తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఊహాజనితమైనవే.

ఈ అంశం తెరపైకి వస్తున్న సమయం కూడా సరైనదికాదు అని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. ఆ ఊహాగానాలను ప్రోత్సహించొద్దని కోరారు. గాంధీ కుంటుంబానికి చెందిన ముగ్గురూ పార్టీలో నాయకత్వం స్వీకరించాలని కాంగ్రెస్ నేత శోభా ఓజా కోరారు. అప్పటినుంచి ప్రియాంక పార్టీలో బాధ్యతలు స్వీకరించే అంశంపై ఊహాగానాలు వచ్చాయి. ప్రియాంక గాంధీ ఎగిరిపడడటంతో.. కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. అయిన ఆశ చావని సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ రాక కోసం ఎదురుచుస్తున్నారు. ఒకవేళ ప్రియాంక గాంధీ రాజకీయల్లోకి వస్తే.. ఆమెకు ఏ భక్తుడు గుడి కట్టిస్తాడో.. చూద్దాం!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles