Venkaiah naidu controversial comments on laon waiver scheme

venkaiah naidu controversial comments on laon waiver scheme, central minister venkaiah naidu, laon waiver scheme for farmers, venkaiah naidu latest news, venkaiah naidu comments on laon waiver scheme, venkaiah naidu comments on chandrababu naidu, venkaiah naidu comments on kcr, cm kcr latest news, cm chandrababu naidu latest news

central minister venkaiah naidu controversial comments on laon waiver scheme

కేసీఆర్-చంద్రబాబులకు కుండబద్దలుకొట్టిన బీజేపీ!

Posted: 07/28/2014 04:02 PM IST
Venkaiah naidu controversial comments on laon waiver scheme

‘‘బాబు, కేసీఆర్ లు... మీకు బీజేపీ ప్రభుత్వం కుండబద్దలు కొట్టేసింది. దాన్ని తట్టుకునే శక్తి మీలో వుందా..?’’ అని ప్రస్తుతమున్న రాజకీయ విశ్లేషకులు వారిద్దరి మీద కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రప్రభుత్వం ఎటువంటి సాయం చేయదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బల్లగుద్దిమరీ స్పష్టం చేశారు. రుణమాఫీ హామీని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలకు తాము ఏవిధంగానూ సాయం చేయలేమని ఆయన వివరించి, విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి రుణమాఫీ ఇచ్చే ఉద్దేశాలు లేవని, వాటి గురించి అస్సలు ఆలోచించడం లేదని’’ ఆయన పేర్కొన్నారు. ‘‘అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రుణమాఫీలు ఇప్పించాల్సిందేనని ఎంత పట్టుదలతో పూనుకున్నా... అందుకు సాయం చేసే ఉద్దేశాలు తమకు లేవని’’ ఆయన ఖరాఖండీగా పేర్కొన్నాడు. అంటే రుణమాఫీ వంటి తలనొప్పి సమస్యలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కేంద్రప్రభుత్వం, బీజేపీ పార్టీలు చెప్పకనే స్పష్టం చేస్తున్నాయమన్నమాట!

ఇక్కడ చర్చించుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వెంకయ్య నాయుడు మోదీ పాలనకు సంబంధించి ఇతరులకు హెచ్చరించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనను ఎవరూ ప్రభావితం చేయలేరని, ఆయనపై ఏ రాజకీయ నాయకుడు ఒత్తిళ్లు తీసుకురాలేరని.. అలాకాకుండా మీరు ఎంత ప్రయత్నించినా దానివల్ల ఫలితం దక్కదని ఆయన కొంతమందిని దృష్టిలో వుంచుకుని అర్థంకానీ రీతిలో కామెంట్లు చేయడం గమనార్హమని కొంతమంది విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles