Land acquisition bill hinders ap capital work

Land Acquisition Bill hinders AP Capital work, AP needs amendments to Land Acquisition Bill, Center considering amendments to Land Acquisition Bill, Construction of AP Capital land acquisition issues

Land Acquisition Bill hinders AP Capital work due to many restrictions and heavy cost on Government

బాలారిష్టగా మారిన భూసేకరణ చట్టం

Posted: 07/24/2014 11:30 AM IST
Land acquisition bill hinders ap capital work

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూసేకరణ చట్టం ప్రతిబంధకమౌతోంది- ఆర్థిక పరంగా.  

జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు చేసినట్లుగా అత్యవసర పరిస్థితి లేదా అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా రైతులు, ఇతర వ్యక్తుల దగ్గర్నుంచి భూమిని తీసేసుకోవటానికి వీల్లేదు.  

భూసేకరణ చెయ్యదలచుకున్న ప్రాంతంలో దానివలన కలిగే సామాజిక ప్రభావాన్ని ముందుగా అంచనా వెయ్యాలి.  అందుకు గాను ఆ ప్రాంతానికి చెందిన పంచయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి తీసుకోవటం తప్పనిసరి.  భూసేకరణ చెయ్యవలసిన అవసరాన్ని నిర్ధారించాలి.  భూసేకరణ వలన ప్రయోజనం, హేతుబద్ధతను నిర్ణయించాలి.  సేకరించవలసిన భూమి ఆ పని కోసం అంత అవసరమా అన్నది నిర్ణయించాలి.  ఆ ప్రయోజనానికి అంత ప్రభుత్వ భూమి అందుబాటులో లేదా అన్నది చూడాలి.  మనది వ్యవసాయాధారిత దేశం కాబట్టి వ్యవసాయంలో ఉన్న భూమిని సేకరించగూడదు.  ఒకవేళ అత్యవసర పరిస్థితిలో అలా చెయ్యవలసి వచ్చినట్లయితే ఆ వ్యవసాయదారులకు ప్రత్యామ్నాయంగా మరోచోట సాగు భూమినే కేటాయించవలసివస్తుంది.  అలాగే నివాస యోగ్యమైన భూమిని ఇళ్ళ స్థలాలు కోల్పోయినవారికి చూపించాలి.  ఇళ్ళు కోల్పోయినట్లయితే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి.  ఖాళీ స్థలాలకు సేల్ డీడ్ లో ఉన్న మొత్తానికి ఒకటిన్నర రెట్లు కానీ, లేదా మార్కెట్ విలువలో కాని చెల్లించాలి.  

భూసేకరణను ప్రజాహితంలో చేస్తున్నట్లయితే దాని వలన ఎంతమంది భూమిని కోల్పోతున్నారు, అందుకు ఎంత పరిహారాన్ని చెల్లించాలి అన్న లెక్కలు వేసుకోవాలి.  నివేదికను తయారు చేసే కమిటీలో గ్రామసభ ప్రతినిధులు, సామాజిక శాస్త్రవేత్తలు, పునరావాస నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉంటారు.

పరిహారాన్ని చెల్లించటానికి కూడా ఒక సంవత్సరం సమయమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.  నోటిఫికేషన్ ఇచ్చిన రోజునుంచి పూర్తి పరిహారం చెల్లించేవరకు 12 శాతం వడ్డీ చెల్లించాలి.

భూసేకరణ చట్టాన్ని సడలిస్తేనే రాజధాని!

ఇలా ఇంకా ఎన్నో ఆంక్షలతో కూడుకున్న భూసేకరణ చట్టం తో భూసేకరణ అసాధ్యమైన పనిగానే మిగిలిపోతోంది.  అందువలన ఆ చట్టంలో కొన్ని సడలింపులు, కొన్ని మినహాయింపులకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles