Khairatabad ganesh laddu prasadam 2014

khairatabad ganesh 2014, khairatabad laddu sale in 2014, khairatabad ganesh laddu prasadam 2014, tapeswaram laddu in khairatabad ganesh hand

khairatabad ganesh laddu prasadam 2014

ఖైరతాబాద్ లో ఈసారి తూగోజి లడ్డూ వేలం?

Posted: 07/15/2014 03:37 PM IST
Khairatabad ganesh laddu prasadam 2014

ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ చేతిలో పెట్టే లడ్డూ ప్రతిసారి లాగానే ఈ సారి కూడా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి వస్తోంది.  గణేశ్ జీ మహారాజ్ ఎత్తు పెరుగుతూ ఉంటే ఆయన చేతిలోని లడ్డూ బరువు కూడా ప్రతిసారీ పెరుగుతూ వస్తోంది.  2010లో 500 కిలోల లడ్డూతో ప్రారంభమై ఈ సారి 2014 గణేశ్ కి 5 టన్నుల బరువున్న లడ్డూని సమర్పించబోతున్నారు.

చాతుర్భాగం అనేది దేవాలయాల్లో మొదటి నుంచి వస్తున్న ఆచారమే.  దేవాదాయ శాఖ లోకి రాకముందు ఆలయాలలో తయారయ్యే ప్రసాదంలోను వచ్చిన హుండీ ఆదాయంలోను చాతుర్భాగం అర్చకులు తీసుకునేవారు.  మరో నాల్గోవంతు ఆలయ నిర్వహణకు ఖర్చుపెట్టి, మిగతాది స్వామివారి నిధిగా ఉంచేవారు.  

అలాగే ఈసారి లడ్డూ ప్రసాదంలో నాల్గవ భాగాన్ని దాన్ని తయారుచేసే సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు తీసుకెళ్తారు.  మరో నాల్గవ భాగాన్ని ఖైరతా బాద్ లో విక్రయిస్తారు.  మిగిలిన సగ భాగాన్ని స్వామి వారి ఉచిత ప్రసాదంగా భక్తులకు అప్పటికప్పుడే వితరణ చేస్తారు.  ఈ ప్రతిపాదనకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు అంగీకరించారని కూడా సమాచారం.  

ఇలా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా వచ్చే లడ్డూ ప్రసాదాన్ని విక్రయించటం ఇదే మొదటిసారి.  అంతకు ముందు ప్రసాదం మొత్తాన్ని భక్తులకు పంచిపెట్టేవారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles