Modi govt indirectly discourages smoking

Modi Govt indirectly discourages smoking, Health Minister Dr.Harshavardhan heavy on tobacco, Duty on Cigarettes increased 6 folds, 6 folds tax on cigarette smoking discourages smoking habit.

Modi Govt indirectly discourages smoking

థాంక్యూ ఫర్ నాట్ స్మోకింగ్ అంటున్న మోదీ ప్రభుత్వం

Posted: 07/13/2014 11:03 AM IST
Modi govt indirectly discourages smoking

పొగాకు పంట మీద ఇంతవరకు కాసులు కూడబెట్టిన రైతులకు ఇక దాని మీద ఆశలు వదులుకోవలసిందే.  ఎందుకంటే సిగరెట్ ల మీద సుంకాలను అమాంతం ఆరు రెట్లకు పెంచటం ద్వారా ఒక్కో సిగరెట్ ని అవసరాన్ని గుర్తించి ఆచి తూచి ముట్టించటం, మధ్యలో ఆర్పి చెవిలో పెట్టుకోవటం లాంటి పనులు చెయ్యవలసిన అగత్యం ఏర్పడుతోంది ధూమపాన ప్రియులకు.  దానితో పొగాకు వినియోగం గణనీయంగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది.

నోటితో లేదనకుండా చేత్తో లేదని అన్నట్లుగా, వద్దు పొగతాగొద్దు అని ప్రత్యేకంగా చెప్పకుండా, పొగతాగటాన్ని అత్యంత విలాసవంతమైన, భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా చేసి ఆ విధంగా ధూమపానాన్ని తగ్గించదలచుకుంది మోదీ ప్రభుత్వం.  

అయితే మరి ఈ చర్య వలన పొగాకు రైతులకు దెబ్బ కదా అంటే, అసలు మనుషుల ఆరోగ్యాన్నే దెబ్బతీసే పొగాకు చేసే చేటుకంటేనా అని అడుగుతున్నారు భాజపా నాయకులు.  పొగాకు తాగే వారే కాకుండా తాగని వారు కూడా ఆ కలుషితమైన గాలి పీల్చి క్యాన్సర్ పాలయ్యే అవకాశం బాగా ఉంది కాబట్టి సమాజంలో ధూమపానాన్ని తగ్గించాలనుకున్న మోదీ ప్రభుత్వం ఎవరూ చెయ్యని సాహసం చేసి పన్నులను అమాంతం ఆరురెట్లు పెంచేసింది.

పొగాకు రైతులనేవారు ప్రత్యేకంగా ఏమీ జన్మించలేదు.  పొగాకుకి డిమాండ్ ఉండటం వలన దాని సాగుని పెంచారంతే.  ఇప్పుడు డిమాండ్ తగ్గిపోతే మిగిలిన పంట మీద పడతారు.  ఇంకా ఎన్ని పంటలు లేవు.  చెరుకుంది, మిరియాలు పత్తిలాంటి లాభసాటి పంటలు ఇంకా ఎన్నోవున్నాయంటున్నారు.  

అంతేకాదు, ఈ మధ్య ఎయిడ్స్ మీద కండోమ్స్ మీద మాట్లాడి వార్తలలోకి ఎక్కిన ఆరోగ్య శాఖామాత్యులు డా.హర్షవర్ధన్, లాభసాటిగా భావించే పొగాకు పంటకోసం అడ్డదిడ్డంగా ఋణాలు తీసుకుని అప్పులపాలవతున్న రైతులను వడ్డీ వ్యాపారుల నుండి రక్షించటానికి వీలవుతుందని అన్నారు.  తన దగ్గరున్న ఆధారాలను బట్టి సిగరెట్, పొగాకు ఉత్పాదనల వ్యాపారస్తులే కూటమిగా ఏర్పడి, రైతులకు ముందుగానే డబ్బు ఎరచూపుతూ వాళ్ళని ఋణాలపాలు చేస్తున్నారని, కాబట్టి అదే లేకపోతే వాళ్ళకి అంత సులభమైన ఋణాలు లభించకపోబట్టి కూడ వాళ్ళు ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు చూపిస్తారని హర్షవర్ధన్ అన్నారు.   

ఇది ఇలాగే సాగితే, దేశంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది అని సవాల్ చేసినట్లుగానే, పొగాకు ని కూడా దేశంలోంచి తరిమివేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టిందని రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యానం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles