Tdp minister devineni uma maheshwara rao fires on cm kcr and harish rao

tdp minister devineni uma maheshwara rao fires on cm kcr and harish rao, tdp minister devineni uma, tdp minister devineni uma fires on cm kcr, tdp minister devineni uma maheshwar latest news, tdp minister devineni uma maheshwar fires on cm kcr, tdp minister devineni uma maheshwar fires on harish rao, cm kcr latest news, cm kcr comments on chandrababu naidu, harish rao comments on chandrababu naidu

tdp minister devineni uma maheshwara rao fires on cm kcr and harish rao

‘‘మామా అల్లుళ్లకు నిద్రపట్టకుండా చేస్తాం’’ -టీడీపీ మంత్రి

Posted: 07/09/2014 03:29 PM IST
Tdp minister devineni uma maheshwara rao fires on cm kcr and harish rao

(Image source from: tdp minister devineni uma maheshwara rao fires on cm kcr and harish rao)

సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం... ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్, టీడీపీ పార్టీ తరఫు నుంచి మంత్రిపగ్గాలు చేపట్టిన నాయకులు... మొదటిరోజు నుంచి ఒకర్నొకరు తిట్టుకుంటూ రావడం జరుగుతోంది. టీఆర్ఎస్ మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటుగా కామెంట్లు చేస్తే... అందుకు జవాబుగా టీడీపీ మంత్రులు కూడా టీఆర్ఎస్ మంత్రుల మీద ఘాటుగానే విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే!

అయితే వీరిమధ్య గొడవలకు అంతులేకుండా పోతోంది. ప్రతిచిన్న విషయానికి అనవసరంగా రాద్ధాంతం చేసుకుంటూ దాన్ని పెద్దగా చేసుకుంటున్నారు. ప్రజల మీద వుండాల్సిన దృష్టిని ఇలా తిట్టిపోసుకోవడంలోనే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇరురాష్ట్రాల పార్టీలు ఇలా దుమ్మెత్తిపోసుకోవడంపై కేంద్రప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేక తప్పలేదు. అయినా కూడా వీరిలో మాత్రం ఎటువంటి మార్పులు రావడం కాదు కదా... ఇంకా ఘోరంగా తిట్టేసుకుంటున్నారు.

ఇప్పుడు తాజాగా టీడీపీ పార్టీ తరఫు నుంచి ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులమీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా విమర్శలు చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అనవసరంగా గొడవల్లోకి లాగి, తిడితే... మామా - అల్లుళ్లకు నిద్రపట్టనీయకుండా చేస్తామని తీవ్రంగా విమర్శించిపారేశారు. ఒకరు మంత్రి, ఇంకొకరు ముఖ్యమంత్రి హోదాలో వుండి కూడా... మరొక ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు తిట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ కు అందాల్సిన నీటిని అందించకుండా... అనవసరంగా నానా రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆయన వెల్లడించారు. అధికారం లేనప్పుడు ఒకరకంగా, అధికారం లేనప్పుడు మరోరకంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. ఇకనుంచి హద్దులు దాటి ప్రవర్తిస్తే... టీఆర్ఎస్ పార్టీకి, మామా-అల్లుళ్లకు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. నీటి విడుదల వల్ల తెలంగాణాకు దాదాపు 237 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి జరిగిందని వెల్లడించిన ఆయన... ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని సూచించారు.

ఈయన చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇంకెన్ని వివాదాలు రేకెత్తుతాయోనని మరోవైపు కొంతమంది రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా... ఈ ఇరుపార్టీల మధ్య ఇటువంటి మాటల యుద్ధం కామనేనని మరికొందమంతి సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందించనున్నారో మరికొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles