Fire therapy to treat illness in china pics

Fire Therapy, Fire Therapy treatment, fire therapy to Treat Illness in China- PICS, Burn, patient, burn

Fire Therapy to Treat Illness in China- PICS, Fire therapy claims curing several diseases ,

నిప్పుతో క్యాన్సర్ రోగం మాయం?

Posted: 07/05/2014 01:11 PM IST
Fire therapy to treat illness in china pics

క్యాన్సర్ రోగం అంటే అందరికి భయమే. ఒక్కసారి క్యాన్సర్ భారీన పడిన వ్యక్తి .. ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవటమే అని అందరు అంటారు. కానీ ఇక్కడ మాత్రం క్యాన్సర్ ఉన్న మీకు ఎలాంటి ప్రాణ నష్టం లేదు? నేను నయం చేస్తానని అంటున్నారు. అది ఎలాంటి మొండి క్యాన్సర్ అయిన సరే నన్ను చూస్తే చాలు దెబ్బకు మాయం అవుతుందని చెబుతున్నారు ఝాంగ్ ఫెంఘారో. అసలు ఇంతకీ క్యాన్సర్ ను నయం చేసే మందు ఏమిటో తెలుసు.. ? నిప్పుతోనే నయం చేస్తాడట?

ఈ వైద్యం మానవ చరిత్రలో ఇది నాలుగో విప్లవమని... చైనీస్, పాశ్చాత్య వైద్య విధానాలను ఇదితో రాసి ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఫైర్ థెరపీ... ఆపరేషన్ల బాధ నుంచి విముక్తి కలిగిస్తుందని తెలిపాడు ఝాంగ్. శరీరంపైన మంట వెలిగిస్తే అది లోపలి చల్లదనాన్ని తొలగిస్తుందని, తద్వారా రోగనివారణ జరుగుతుందని సెలవిచ్చాడు.

చైనాలో వినూత్న తరహాలో చికిత్స చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇతగాడు వైద్యవిధానంలో ఉపయోగించే ప్రధాన ఔషథం... అగ్ని! రోగిపై ఓ కండువా వేసి దానిపై ఆల్కహాల్ పోస్తాడు. ఆ తర్వాత, కండువాకు నిప్పుపెడతాడు. దాంతో, రోగ నివారణ జరిగిపోతుందని చైనీస్ అంటున్నారు.

firetherapy-china

ఇలా మానసిక ఒత్తిళ్ళు, అజీర్ణం, సంతానలేమితో పాటు ప్రాణాంతక క్యాన్సర్ నూ నయంచేస్తాడట. నిప్పు సాయంతో తాను చేసే వైద్యానికి 'ఫైర్ థెరపీ' అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఇతని పేరు ఝాంగ్ ఫెంఘారో. బీజింగ్ లో నివసించే ఈ థెరపిస్ట్ కు కొందరు శిష్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి ఫీజు వసూలు చేస్తూ, ఫైర్ థెరపీలో శిక్షణ ఇస్తున్నాడు.

అయితే..క్యాన్సర్ తగ్గటం ఏమో గానీ .. వేడి వేడి నిప్పు దెబ్బకు .. ఒళ్లంత బొబ్బలు వచ్చి, తరువాత మందు రాసుకోలేక చాలా ఇబ్బంది పడినట్లు కొంతమంది ఫైర్ థెరఫీ బాధితులు చెబుతున్నారు. అయితే మన ఫైర్ థెరపీ డాకర్ట్ మాత్రం ఆపరేషన్ చేస్తే.. కుట్లు వేస్తారు కదా ..అలాగే. ఇది కూడా కొంచెం వేడిగా ఉంటుంది కానీ క్యాన్సర్ రోగం మాత్రం నయం అవుతుందని గొప్ప చెబుతున్నారు. అయిన ఎవరి నమ్మకం వారిది. మోసం చేసేవాడు ఉన్నంత కాలం.. ప్రజలు మోసపోతునే ఉంటారు.

అందుకే మన చేతిలో ఉన్న ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తే .. ఎలాంటి క్యాన్సర్ భారీన పడకుండ, ఇలాంటి ఫైర్ డాక్టర్ల చేతిలో చిక్కుండా హాయిగా బతికేయవచ్చు! మన ఆరోగ్యమే .. మనకు శ్రీరామరక్ష!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles